రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు
నర్సాపూర్: మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు , మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రాధా మల్లేష్ గౌడ్ , బొక్క నర్సింహా రెడ్డి , ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్సాపూర్ ప్రజలు, పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తల ఉత్సాహం బిజెపి పై పెరుగుతున్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికే ఓటు వేద్దాం. నిజమైన అభివృద్ధి, పారదర్శక పాలన కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుకే ఓటేయాలి అని రామచందర్రావు కోరారు.