– అనంతపురం రూరల్ మండల టీడీపీ నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా కీలక సమావేశం
– పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో కీలక నాయకుల భేటీ
– రూరల్ శ్రేణులు కీలక పాత్ర పోషించాలన్న పల్లా, సునీత, శ్రీరామ్, ఏలూరి
అనంతపురం: సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ నేపథ్యంలో అనంతపురం రూరల్ మండల నాయకులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక సూచనలు చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు ఏలూరు సాంబశివరావు, మన్నే సుబ్బారెడ్డి, ఆదోని కృష్ణమ్మ, పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. సభకు ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో నాయకులు క్షేత్రస్థాయిలో జన సమీకరణ పై చర్చించారు.
అనంతపురం నగరంలో సభ ఉండటంతో రూరల్ వారికి చాలా దగ్గరగా.. అందునా రూరల్ మండలం చాలా పెద్దది కాబట్టి జనం ఎక్కువగా తరలి వచ్చేలా చూడాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు. దీనిని ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 164 మంది ఎమ్మెల్యేలు మీ సభలో పాల్గొంటారు కాబట్టి ఇది మనకు ఎంతో ప్రతిష్ఠాత్మకమని ఆయన సూచించారు.
పరిటాల సునీత మాట్లాడుతూ గడిపిన ఎన్నికల్లో రూరల్ మండలంలో భారీ మెజార్టీతో గెలిపించాలని… అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతంలో జరుగుతున్న అతిపెద్ద సభ కావడం వల్ల… దీనిని విజయవంతం చేసే బాధ్యత మనపై ఎక్కువగా ఉందన్నారు. రూరల్ మండలం నుంచి 20 వేల మందికి తగ్గకుండా జనం వచ్చేలా చూడాలని నాయకులకు సూచించారు. సభకు వచ్చేవారికి ప్రత్యేకంగా సూచనలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ అందుతున్న నేపథ్యంలో ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చేలా చూడాలన్నారు.