The Union Minister of Coal and Mines, Shri G. Kishan Reddy attends the release meeting of the guidelines for the rejuvenation of traditional water bodies in coal and lignite mining regions held at Shastri Bhawan, in New Delhi on August 01, 2024.
– ప్రధాని మోదీ పిలుపునకు యువత స్పందించాలి
– ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆటల పోటీలు
– రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ
– డిసెంబర్ 25 నుంచి10 జనవరి వరకు రిజిస్ట్రేషన్లు
– క్రికెట్, కబడ్డీ, ఖో ఖో, వాలీ బాల్, అథ్లెటిక్స్
– జనవరి 20 నుంచి ఫిబ్రవరి 3వరకు పోటీలు
– పోస్టర్ లాంచ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో నిర్వహిస్తున్న ఖేల్ మహోత్సవను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్, మహబూబ్ కాలేజ్, ఎస్వీఐటీ ఆడిటోరియంలో జరిగిన సాంసద్ ఖేల్ మహోత్సవ్ లో ఆయన పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్ కోడ్, పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు.
‘‘దేశవ్యాప్తంగా ఇవాళ భారతరత్న మన బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దేశానికి అనేక సేవలందించిన మహానుభావుడు వాజ్ పేయి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. వాజ్ పేయి ఒకసాధారణ వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రేమ, ఆప్యాయతతో దగ్గరయ్యారు. ఆయన అద్భుత కవి, ఆయన కవి సమ్మేళనాల్లో కూర్చునేందుకు చోటు ఉండేది కాదు. పార్లమెంట్ లో ఒక్క ఎంపీ తగ్గినప్పుడు.. ఇతర పార్టీల నుంచి చీలక తెచ్చి అధికారం తీసుకుందామని చాలా మంది అన్నప్పుడు వాజ్ పేయి ఇలా స్పందించారు. ఒక్క ఎంపీ తక్కువ ఉన్నప్పుడు అధికారం వద్దు.. నేను ప్రజల మధ్యకు వెళ్తా అని ప్రజల్లోకి వెళ్లిన గొప్ప నాయకుడు.
ఏ ప్రధానమంత్రి సాహసం చేయని విధంగా అణు పరీక్షలకు అనుమతి ఇచ్చిన ఏకైక ప్రధాని వాజ్ పేయి. అబ్ధుల్ కలాం గారు.. అణు పరీక్షలకు అనుమతి కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇతర ప్రధానులను ఎందర్ని కలిసినా.. ఎవరూ సాహసించలేదు. అమెరికా భయపడుతదేమోనని ఎవరూ ముందుకు రాలేదు. అణు పరీక్షలు చేస్తే ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి ఒత్తిడి వస్తుందోనని ప్రధానులు ఎవరూ సాహసించలేదు. కానీ, వాజ్ పేయి దగ్గరికి అబ్దుల్ కలాం వచ్చినప్పుడు మూడో కంటికి తెలియకుండా రాజస్థాన్ లోని ఫోక్రాన్ లో అణు పరీక్షలు చేయించారు. అలా గొప్ప నాయకత్వ పటిమ కలిగిన వ్యక్తి వాజ్ పేయి.
ఈరోజు అద్భుత జాతీయ రహదారులు మన ముందు కనిపిస్తున్నాయంటే.. దానికి ఆద్యుడు వాజ్ పేయి. ప్రధానమంత్రి మోదీ వచ్చిన తర్వాత లక్షల కోట్లు ఖర్చు చేసి జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్ల నిర్మాణం జరిగింది. గొప్ప నాయకుడు స్థాపించిన పార్టీలో.. గొప్ప నాయకుల పాలనలో దేశం ముందుకు వెళ్తోంది.
సంతోషం ఏమిటంటే.. 1980లో వాజ్ పేయి హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చినా ఆయనకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. అలాంటి గొప్ప నాయకుడి జన్మదినోత్సవాలను ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నా. వాజ్ పేయి గారి జన్మదినోత్సవాన్ని ప్రధాని మోదీ క్రీడలకు అంకితం చేశారు. వాజ్ పేయి గారి మీటింగ్ కు వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు గుట్టుచప్పుడు కాకుండా హాజరై ప్రసంగం వినేవారు. వాజ్ పేయికి యువ హృదయ సామ్రాట్ అనే బిరుదు ఉన్నది. ఈ దేశంలో ఉన్న యూత్ మొత్తం వాజ్ పేయి అంటే ఎంతో ఇష్టపడేవారు. అందుకే వాజ్ పేయి జన్మదినోత్సవం సందర్భంగా ఆటల పోటీలకు శ్రీకారం చుట్టారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 40 డివిజన్ల వారీగా కమిటీలు వేశాం.. ఈ వేడుకలు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని క్రీడాకారులు, పార్టీ నాయకులు, విద్యా సంస్థలు, స్పోర్ట్స్ అసోసియేషన్స్ అందరితో కలిసి సమన్వయం చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ ద్వారా అందరూ రిజిస్టర్ చేసుకునేలా ప్రోత్సహించాలి. ఈ కాంపిటిషన్స్ బాయ్స్, గర్ల్స్ ఇద్దరికి వేర్వేరుగా ఉంటాయి. అన్ని ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఇంటర్ క్యాంపస్ కాంపిటీషన్స్ పెట్టాలి.
విన్నర్స్ టీమ్ రెడీ చేసుకోవాలి. అంబేద్కర్ కాలేజీ, కేశవ్ మెమోరియాల్ కాలేజీల్లో పోటీలు పెట్టాలి. ప్రతి డివిజన్ వారీగా క్రికెట్, కబడ్డి, ఖోఖో టీమ్ లు ఎన్ని వస్తే అన్నిటిని గుర్తించి డివిజన్ల వారీగా కాంపిటిషన్స్ పెట్టాలి. రన్నర్స్ టీమ్స్, విన్నర్స్ టీమ్ లతో అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా మళ్లీ పోటీలు పెట్టాలి.
ఇక్కడ వచ్చిన రన్నర్స్, విన్నర్స్ టీమ్ లతో పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో జరగాలి. అసెంబ్లీ స్థాయిలో మీడియాతో టీమ్ తో పార్టీ నాయకుల టీమ్ తో కాంపిటిషన్ పెట్టాలి. క్రికెట్, కబడ్డి, ఖోఖో, వాలిబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలి. జనవరి10 వరకు15 రోజుల పాటు టీమ్ ల రిజిస్ట్రేషన్లు చేయాలి. ఏ డివిజన్ పోటీలు ఆ డివిజన్లోనే జరగాల్సిన అవసరం ఉంది”అని అన్నారు