-నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి
కోవూరు నియోజకవర్గంలో మొదటసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మహిళకు అవకాశం కల్పించిందని, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోరారు. ప్రశాంతిరెడ్డితో కలిసి గురువారం కోవూరు మండలంలోని మొడేగుంట గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేమిరెడ్డి దంపతులు తమ సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అనేక గ్రామాల్లో సురక్షిత త్రాగునీరు అందిస్తున్నారని తెలిపారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం తో పాటు, దైవ కార్యక్రమాలకు చేయూతనిస్తున్నారని చెప్పారు.
కోవూరులో ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యేగా, నెల్లూరు పార్లమెంట్‌లో ప్రభాకర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అన్నివర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మొడేగుంట గ్రామ ప్రజలు ప్రశాంతి రెడ్డి గారికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.