Suryaa.co.in

Andhra Pradesh

టిడిపి మహిళా నేత గ్రీష్మ ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన చర్య

– వైసీపీ నేత నారాయణమూర్తిపై డీజీపీకి ఫిర్యాదు

టిడిపి మహిళా నేత గ్రీష్మ ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నారాయణమూర్తిపై టీడీపీ మహిళా నేతలు, ఎస్పీ సెల్ నేత ఎంఎస్ రాజు డీజీపీ కి ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్టాడారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ నేత ఎంఎస్ రాజు మాట్లాడుతూ… గ్రీష్మను ఉద్దేశించి నీవు రాష్ట్రంలో ఉన్నావు కదా? నీ మీద అత్యాచారం జరగలేదు కదా అని మాట్లాడటం తగునా? ఒక టీవీలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపుల మీద చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ టీడీపీ తరపున మహిళా నేత గ్రీష్మ పాల్గొనగా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తరపున అధికార ప్రతినిధి, నవరత్నాల ఛైర్మన్ నారాయణమూర్తి అసభ్యకరంగా మాట్లాడారు.

అక్రమాలు, దుర్మార్గాలు, మహిళలపై జరుగుతున్న దాడులన్నింటిని వివరిస్తున్నప్పుడు సహనం కోల్పోయి విచక్షణారహితంగా మాట్లాడారు. వైసీపీ నేత నారాయణమూర్తి అత్యంత అవమానకర పద్ధతిలో సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరించారు. అనాగరికుడు కూడా మాట్లాడని ఒక పశుభాషని వాడారు. ప్రత్యక్షంగా మాట్లాడిన కుసంస్కారి నారాయణమూర్తి. జరిగిందంతా డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం.

అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 13 జిల్లాల్లో దాదాపు 15 వందల మంది మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, హత్యలు, అత్యాచారాలు

జరిగాయి. పశువు కంటే నీచంగా అత్యంత హీనంగా నారయణమూర్తి మట్లాడారు. ఆయన కుమార్తె వయసున్న గ్రీష్మని నీపై అత్యాచారం జరగలేదు కదా అని మాట్లడాడంటే అతను మనిషా? పశువా?. అతనిది మానవ జన్మేనా?

తాడేపల్లి లోని సీఎం నివాసానికి అతి సమీపంలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగితే నేటి వరకు చర్యలు లేవు. పులివెందుల నియోజకవర్గంలో సాక్షాత్తు సీఎం నివాసం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నాగమ్మ అనే మహిళ ను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే చర్యలు లేవు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి, హోం మంత్రికి, కనబడటంలేదా?
సమాజం చూస్తోందనే ఇంగిత జ్ఞానం కూడా నారాయణమూర్తికి లేదు. తల్లిని, చెల్లిని, బాబాయి కూతుర్ని వదిలేసిన వారికి సంస్కారం ఎలా ఉంటుంది? నారాయణమూర్తి తల్లి, చెల్లి, భార్య, కూతురుపై కామెంట్లు చేస్తేనే ఇతరులకు అన్యాయం జరిగినట్లా? కుమార్తె వయసున్న గ్రీష్మాని నీపై అత్యాచారం జరగలేదు కదా అని మాట్లాడటం అత్యంత నీచమాలిన చర్య. మంత్రి సంభాషణ ఆడియో బయటికి వచ్చినా చర్యలు లేవు. ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక మహిళతో జరిపిన రాసలీలలు బయటికొచ్చినా చర్యలు శూన్యం.

టీడీపీ అధికార ప్రతినిధి గ్రీష్మపై వైసీపీకి చెందిన నారాయణమూర్తి అసభ్యకరంగా మాట్లాడటం బాధాకరం. ”నీవు రాష్ట్రంలో ఉన్నావు కదా? నీ మీద అత్యాచారం జరగలేదు కదా” అని మాట్లాడటం సిగ్గుమాలిన చర్య. పశుభాషని వాడిన కుసంస్కారి నారాయణమూర్తి. నారాయణమూర్తిపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. వైసీపీ ఎమ్మెల్యే రాసలీలలాడినా చర్యలు లేకపోవడంతో నారాయణమూర్తి ఇలా మట్లాడటం అత్యంత దారుణం. మీడియా సమక్షంలో, లైవ్ లో అంత ఘోరంగా మాట్లాడటమా?

టీడీపీ ఎస్ సీ సెల్ తరపున, టీడీపీ మహిళా నేతల అందరి సమక్షంలో 48 గంటల్లో గ్రీష్మకు క్షమాపణ చెప్పాలి, పోలీసు యంత్రాంగం అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. నారాయణమూర్తి ఇంటిని కూడా ముట్టడిస్తామని టీడీపీ ఎస్సీ సెల్ నేత ఎంఎస్ రాజు మండిపడ్డారు.

LEAVE A RESPONSE