-కేంద్రం కన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందని విజయసాయి రెడ్డి అంటారా?
-నీ దగ్గర డబ్బు ఉంటే రాజధాని ఎందుకు కట్టలేదు
-జగన్ ప్రభుత్వం వెంటనే అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలి
-రెండు ప్రభుత్వాల వల్లే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది
-ఆర్ ఆర్ ప్యాకేజీ వివరాలు ఇస్తే మీరు పూర్తిగా దొరికి పోతారు
-బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
-రాజధాని అమరావతి ప్రాంతంలో మనం..మన అమరావతి బిజెపి సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర
గత ఎన్నికల ముందు జగన్ ట్రాప్లో పడకపోతే చంద్రబాబునాయుడు తమతోనే ఉండేవారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కేంద్రం కంటే రాష్ట్ర అప్పులే తక్కువని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితే బాగుందన్న విజయసాయి మాటలు నిజమైతే మరి రాజధాని నిర్మాణం ఎందుకు చేయలేదు? రోడ్లు ఎందుకు నిర్మించలేదు? ఆర్ఆర్ ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతిలోనే రాజధాని నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అమరావతిలో రాజధాని నిర్మించాలంటూ గుంటూరు జిల్లా బీజేపీ శాఖ నిర్వహించిన పాదయాత్రను సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము ఏమన్నారంటే.. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఎపి
లో అనేక పరిణామాలు మారాయి.ఆనాటి టిడిపి ప్రభుత్వం రైతుల నుండి భూములు సేకరించింది. రాజధాని నిర్మాణం చేయకుండా వదిలేశారు.4వేలకోట్లు, 2500కోట్లు నిధులు ఆనాడు కేంద్రం మంజూరు చేసింది.అమరావతి స్మార్ట్ సిటీకి ఈ డబ్బు వినియోగించ లేదు.
ఇప్పటి సిఎం మాట తప్పను, మడమ తిప్పను అన్నారు.ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, అమరావతి అభివృద్ధి చేస్తా అని నమ్మించాడు.మాట మార్చి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు.రెండు ప్రభుత్వాల వల్లే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది.జగన్ ప్రభుత్వం వెంటనే అమరావతి లో నిర్మాణాలు చేపట్టాలి.పది వేల ఎకరాలను అలాగే ఉంచి ప్రభుత్వ అవసరాలకు వాడాలి.
కేంద్రం మొదటి నుంచీ చెప్పిన హామీలను అమలు చేస్తుంది.ఎయిమ్స్, ఫ్లైఓవర్లు, బైపాస్ నిర్మాణాలుకు నిధులు ఇచ్చాం.అనంతపురం నుండి అమరావతి వరకు రహదారి.రాజధాని లో అంతర్గత రహదారులు నిర్మిస్తాం.ఆరోజే రైతులకు భూములు విభజించి ఇవ్వాల్సింది.ఆనాడు సిఎం జగన్ ట్రాప్ లో పడకుండా ఉంటే బిజెపి తోనే ఉండేవారు.నేడు జగన్ అసలు అధికారం లోకి వచ్చే వాడే కాదు.
రాజధాని గ్రామాలలో సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది.కేంద్రం కన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందని విజయసాయి రెడ్డి అంటారా?మీరు బియ్యం ఎందుకు ఇవ్వలేదు, రోడ్లు ఎందుకు వేయలేదు?కాంట్రాక్టర్ లు బిల్లుల కోసం పోరాటం ఎందుకు చేస్తున్నారు?నీ దగ్గర డబ్బు ఉంటే రాజధాని ఎందుకు కట్టలేదు?మూడు రాజధానులు అన్నారు…నిర్మాణం చేయలేదే?పార్లమెంటు భవనానికి మోడీ
800కోట్లతో నిర్మించారు.అమరావతి ని ముందుకు తీసుకెళ్లడమే బిజెపి లక్ష్యం. చంద్రబాబు 25వేల కోట్లు అదనంగా అడిగిన డబ్బునే జగన్ అడుగుతున్నాడు. పోలవరం విషయం లో ఆర్ ఆర్ ప్యాకేజీ వివరాలు ఇచ్చావా? అవి ఇస్తే మీరు పూర్తిగా దొరికి పోతారు. అవన్నీ చెబితే మేము పరిశీలించి నిధులు ఇస్తాం.మీరు చేయాల్సినవి చేయరు.. మమ్మలని అంటారా?మీరు అనుకునే డబ్బు మిషన్లు బిజెపి వద్ద ఉండవు.పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను ముంచకండి.పోలవరం పై చిత్తశుద్ధి ఉంటే.. అన్ని లెక్కలు సమర్పించండి.
బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ… బిజెపి మాత్రమే రాజధాని సమస్యకు న్యాయం చేస్తుంది. రైతులు కూడా ఈ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నారు.అందుకే అమరావతి జేఏసి పాదయాత్రకు పూర్తి మద్దతు ప్రకటించారు.మేం కూడా వారికి భరోసా కల్పించేందుకే పాదయాత్ర.మా పార్టీ నాయకత్వం కూడా ఈ విషయంలోరైతులకు మద్దతుగా ఉంది.
మనం మన అమరావతి పాదయాత్ర ప్రోగ్రాం కన్వీనర్ కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ…ఈ రాష్ట్రంపై బిజెపి ప్రత్యేక దృష్టి పెట్టింది. విభజన చట్టం ప్రకారం 11 సంస్థలు ఇవ్వాల్సి ఉంటే 18 కేంద్ర సంస్థలు ఇచ్చాం.రాష్ట్ర ప్రభుత్వం సరైన భూ కేటాయింపులు కూడా చేయలేదు.కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విషయంలో బిజెపి ఒత్తిడి తెస్తుంది.
ఈ పాదయాత్రలో కో కన్వీనర్ శనక్కాయల ఉమాసంకర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, జిల్లా ఇంచార్జి సురేందర్ రెడ్డి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, జూపూడి రంగరాజు,మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, భాస్కర్, రాజశేఖర రెడ్డి, భిమవరపు సురేందర్ రెడ్డి, కుమార్ గౌడ్,అప్పిశెట్టి రంగా,గారపాటి పూర్ణ, పాలపాటి రవికుమార్, వనమా నరేంద్ర,అమ్మిశెట్టి ఆంజనేయులు, రమాకుమారి,కంతేటి బ్రహ్మయ్య,బిజెపి సీనియర్ నాయకులు జమ్ముల శ్యామ్ కిషోర్,ఈదర శ్రీనివాసరెడ్డి,ఉయ్యాల శ్యామ్ వరప్రసాద్,ఆవుల నాగేంద్ర,సాయి, బుల్లిబాబు, తాడువాయి రామకృష్ణ, ప్రశాంతి,సీత, నాగమల్లేశ్వరి,లక్ష్మీ సామ్రాజ్యం,ఏలూరి లక్ష్మి మరియు బిజెపి నాయకులు అమరావతి రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు