Suryaa.co.in

Telangana

జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో సినీనటి మంచులక్ష్మి

గద్వాలలో సినీనటి మంచులక్ష్మి సందడి

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సినీనటి, ప్రఖ్యాత నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి బుధవారం ఉదయం వచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కలెక్టర్ వల్లూరి క్రాంతితో సమావేశమై జిల్లా పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయనున్నారని ఆమె పీఏ, వెంట వచ్చిన అనుచరులు తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో వచ్చినట్లు తెలిపారు.

టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తతు తీసుకునేందుకు ఆ సంస్థ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మీ ముందుకు వచ్చినట్లు సమాచారం‌. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య, కంప్యూటర్ క్లాస్ తదితర మౌళికవసతులు కల్పించనున్నారు.

LEAVE A RESPONSE