Suryaa.co.in

Telangana

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలుసుకున్నారు.

ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామాత్యులు దామోదర రాజనర్సింహాతో పాటు మంత్రిని కలిసిన మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో పాటు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం , కవ్వంపల్లి సత్యనారాయణ , కాలె యాదయ్య , మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు , మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE