– లోకేష్ చొరవతో అధునాతన కమ్యూనిటీ హల్, కృష్షునుని విగ్రహ ప్రతిష్టా చేస్తా యాదవ సంఘం ప్రముఖులు రామకృష్ణ
మంగళగిరి: కృష్ణుని విగ్రహం విషయం లో వివాదాన్ని తెలుసుకున్న బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆ ప్రాంతాన్ని పరిశీలన చేస్తానని తన షెడ్యూల్ లో ప్రకటన చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంగళగిరి లోని యాదవ సంఘం ప్రముఖులు, స్థానిక టిడిపి నేతలు మంగళగిరి ఇందిరానగర్ లోని వివాదాస్పద ప్రాంతానికి నిన్న చేరుకున్నారు. మీడియాని పిలిపించుకుని వారితో మాట్లాడుతూ.. రామచంద్ర యాదవ్ ను ఇక్కడకు రానివ్వబొమని వస్తే అడ్డుకుంటామని హెచ్చరిక లు జారీ చేశారు.
ఈ విషయం మీడియా లో పెద్ద ఎత్తున హైలైట్ అయ్యింది. రామచంద్ర యాదవ్ షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం అయన వివాదాస్పద ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. ఈలోపు తాము మీడియా లో చెప్పిన విషయాలు ఆత్మ విమర్శ చేసికుని తాము తొందర పడి హడావిడి చేశామని అలోచించి బుధవారం మధ్యాహ్నం వారంతా కలిసి బిసివై పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. బోడె రామచంద్ర యాదవ్ ను కలిసి వారి తప్పిదాన్ని వివరించారు. తొందరపాటుకు క్షమాపణలు కోరారు.
వారి మాటలను గౌరవిస్తూ రామచంద్ర యాదవ్ వివాదాస్పద ప్రాంత పర్యటిచడం విరమించుకున్నారు. విగ్రహం పూర్వ వైభవానికి యాదవ సంఘ ప్రముఖులు చేస్తున్న కృషిలో పూర్తి సహకారం అందిస్తానని రామచంద్ర యాదవ్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం బిసివై పార్టీ కార్యాలయం లోనే యాదవ సంఘం ప్రముఖులు రామకృష్ణ నేత్రుత్వంలో మీడియా తో మాట్లాడారు. పొరపాటున రామచంద్ర యాదవ్ ని అపార్ధం చేసుకుని తొందరపాటులో మాట్లాడామని తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి లోకేష్ చొరవతో అధునాతన కమ్యూనిటీ హల్, కృష్షునుని విగ్రహ ప్రతిష్టా చేస్తానని చెప్పారు. భవిషత్తులో యాదవ సంఘీయులకు ఎటు వంటి అవసరం వచ్చినా రామచంద్ర యాదవ్ సహకారం తీసుకుంటామని ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం లోని అనేకమంది యాదవ ప్రముఖులు పాల్గొన్నారు