Suryaa.co.in

Andhra Pradesh National Telangana

రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీపై మాణిక్యం ఠాగూర్-విజయసాయి రెడ్డి ట్వీట్ వార్

ఢిల్లీ : రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీ పై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి ట్విటర్ లో స్పందించారు. ‘‘చైనా దౌత్యవేత్తలతో కలిసి నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పార్టీ చేసుకుంటున్న వీడియో చైనా హనీ ట్రాప్‌లు పెరుగుతుండడం కలవరపెడుతోంది. నేపాల్‌లోని చైనీస్ రాయబారి హౌ యాంకీ రాహుల్ గాంధీతో ఉంది. కాంగ్రెస్ పార్టీ సొంత నేత ఇలా చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ యూరోప్ పర్యటనను అనవసరంగా ప్రశ్నించింది’’ అని విజయసాయిరెడ్డి ట్విటర్ లో సెటైర్లు వేశారు.

విజయ సాయి రెడ్డి ట్వీట్ కి ఘాటుగా స్పందించిన మాణిక్యం ఠాగూర్
విజయ సాయి రెడ్డి ట్విట్‌కి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఘాటుగా స్పందించారు.‘‘అవినీతి విజయసాయిరెడ్డి నిజం తెలుసుకోవాలి. మీ సమస్య జగన్‌రెడ్డిపై ఉన్న అవినీతి కేసులన్నీ మాకు తెలుసు. అందుకు మీరు సాహెబ్‌ని సంతోషంగా ఉంచాలి. కానీ నిజం మర్చిపోకండి. నేపాల్ అంబాసిడర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నేపాల్ వెళ్లారు. నేపాల్‌కి చెందిన ఖాట్మండు పోస్ట్ పేపర్ క్లిప్‌ను మాణిక్యం ఠాగూర్ టాగ్ చేశారు. వివాహ వేడుకకు హాజరుకావడంలో తప్పేముందని విజయసాయిరెడ్డిని మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

LEAVE A RESPONSE