Suryaa.co.in

Telangana

బతుక‌మ్మ చీర‌ల‌కు మించిన ఆర్దిక ప్ర‌యోజ‌నాలు

– మాజీ మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌ను ఖండించిన పంచాయ‌తీ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ‌ల శాఖ మంత్రి సీత‌క్క‌

హైదరాబాద్: ప్ర‌జా ప్ర‌భుత్వంలో బతుకమ్మ చీరను బంద్ పెట్టారన్న హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం.నాసి ర‌కం చీర‌లిచ్చి మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వాన్నిబీఆర్ఎస్ కించ‌ప‌రిచింది. బతుక‌మ్మ చీర‌ల‌కు మించిన ఆర్దిక ప్ర‌యోజ‌నాల‌ను మ‌హిళ‌ల‌కు క‌ల్పిస్తున్నాం. బ‌తుక‌మ్మ చీర‌ల‌కు గ‌త ప్ర‌భుత్వం ఏడాదికి చేసిన ఖ‌ర్చు రూ.300 కోట్లు మాత్ర‌మే.

మ‌హిళ‌ల‌కు ఆర్దిక స్వేచ్చ క‌ల్పించేందుకు ఆర్టీసీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని అమ‌లు ప‌రుస్తున్నాం. మ‌హిళ‌కు ప్ర‌యాణ బారం లేకుండా ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని కల్పిస్తున్నాం.పైసా ఖ‌ర్చు లేకుండా మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణం చేస్తున్నారు. నిన్నటి దాకా 98.50 కోట్ల ఉచిత ప్ర‌యాణాల‌ను అక్క‌చెల్లెమ్మ‌లు వినియోగించుకున్నారు. ఉచిత ప్ర‌యాణం విలువ అక్ష‌రాల రూ. 3,325 కోట్లు.అంటే స‌గ‌టున నెల‌కు రూ. 332 కోట్లు ఆడ‌బిడ్డ‌ల‌కు ఆదా అవుతోంది.

గ‌త ప్ర‌భుత్వం బ‌తుక‌మ్మ చీర‌ల కోసం వెచ్చించిన‌ బ‌డ్జెట్ కు, ప‌దిరెట్లు అధికంగా ఉచిత బ‌స్సు ప్ర‌యాణం కోసం మా ప్ర‌భుత్వం వెచ్చిస్తోంది. ఒక్క ఏడాది కోసం బ‌తుక‌మ్మ చీర‌ల ఖ‌ర్చు రూ. 300 కోట్లు. అదే ఒక్క నెల ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఖ‌ర్చు రూ.332 కోట్లు. మ‌హిళ‌ల‌ వంటింటి భారం త‌గ్గించేందుకు రూ.500 కే గ్యాస్ సిలిండ‌ర్. అదే బీఆర్ఎస్ హ‌యంలో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ రూ. 1200.

రూ.500 కే గ్యాస్ సిలిండ‌ర్ ఇచ్చేందుకు ఇప్ప‌టికే రూ. 300 కోట్ల‌కు పైగా ప్ర‌జా ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది. 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ప‌థ‌కం కింద వేయి కోట్లు వెచ్చించాం.మ‌హిళా సంఘాల ఆర్దిక స్వావ‌లంబ‌న‌ కోసం బ్యాంకుల‌కు రూ.400 కోట్ల వ‌డ్డీని ప్ర‌భుత్వ‌మే చెల్లించింది. మ‌రో వేయి కోట్లు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నాం.

మ‌హిళ‌ల గౌర‌వాన్ని నిలబెడుతూ వారిని ఆర్దికంగా బ‌లోపేతం చేసేందుకు చేయుత నిస్తున్నాం. బీఆర్ఎస్ పాల‌న వైఫ‌ల్యాల‌ను స‌రిదిద్దుతూ ఎన్నిక‌ల హ‌మీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు పరుస్తున్నాం.

LEAVE A RESPONSE