కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక, దేశ విధ్వంసకర విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగా సంఘాల జాతీయ సమాఖ్యలు దేశవ్యాపిత 21 వ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు వందలాది రైతుసంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా మద్దతు ప్రకటించింది.
దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం మాటల్లో జాతీయత, దేశభక్తి ఆచరణలో దేశాన్ని విధ్వసం చేసే విధానాలను అమలుపరుస్తుంది. స్వాతంత్య్రం తరువాత దేశ ప్రజానీకం అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వరంగ సంస్థలు కార్పొరేట్లకు అమ్మకానికి పెడుతుంది. నేషనల్ మానిటైజేషన్ పైపు లైన్ పేరుతో ఓడరేవులు, టెలికాం, పోస్టల్, రైళ్లు విద్యుత్ స్టేషన్ల బొగ్గుగనులను, జాతీయరహదారులు, విమానాశ్రయాలు, ఎఫ్.సి.ఐ లాంటి ప్రజా ఆస్తులను కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టింది. సామాన్యప్రజలు సౌకర్యాలుపొందాలంటే అధిక డబ్బు పెట్టాల్సిందే.
కేంద్ర విధానాలపైనా సంపద సృష్టికర్తలైన కార్మికులు కర్షకులు ఉద్యోగులు గత 60 ఏండ్లుగా పోరాడుతూనే ఉన్నారు. ఉద్యోగుల కష్టార్జితమైన ప్రావిడెంట్ ఫండ్, పెన్సన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్సు మ్మ్యూచ్యువల్ ఫండ్ కు అప్పజెప్తుంది. కార్పొరేట్ల ప్రయోజనాలకోసం 4 కార్మిక చట్టాలను వాటిని ఏక పక్షంగా పార్లమెంటులో చట్టం చేసి అమలు పరిచి ఉద్యోగుల జీవితాల్ని ఛిద్రం చేయడనికి సిద్దమైనది. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలతో ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తుంది. ఉపాధి కరువై నిరుద్యోగత పెరిగి అధిక ధరలతో ఆకలి, అసమానతలు పెరిగి తీవ్రరూపం దాల్చే ఆర్థిక విధానాలు కేంద్రం అమలుచేస్తుంది.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సామాన్యులపై భారాలు మోపి సంపన్నులకు వరాలనిచ్చి ఉద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లింది. గత రెండేళ్ళుగా కోవిడ్ తో అతలాకుతలమైన ప్రజల బతుకులు ఇంకా చీకట్లో మగ్గుతున్నాయి. నిత్యావసర ధరలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. దేశంలో 64.4 శాతం సంపద కేవలం10 మంది కుబేరుల చేతుల్లో,50 శాతం పేద ప్రజల సంపద 6 శాతం మంది చేతిలో ఉందంటే ఎవరి సొమ్ము సంపద ఎవరికీ దోచిపెడుతున్నారో అర్ధమవుతుంది.
నిత్యావసర ధరలు పెరిగిన క్రమంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనిదినాలు 200 కల్పించాలి. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి. ఎన్పిఎస్ ను రద్దు చేసి ఒపిఎస్ ను పునరుద్దరిస్తూ కనీసవేతనం 26000 రూపాయలుగా నిర్ణయించి కాంటాక్ట్ లేబర్ విధానాన్ని తొలగించాలి.
కార్మిక చట్టాల అమలును ఉపసంహరించుకొని-వేతనాల చెల్లింపు, కనీస వేతనం, బోనస్ చెల్లింపు,
సమాన పనికి సమాన వేతనం, చట్టాలను సజీవంగా ఉంచాలి. లేదంటే కేంద్రం మెడలు వంచి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయిచుకున్న రైతాంగ పోరాట ప్రేరణతో నాలుగు లేబర్ కోడ్ ల రద్దు కొరకై సమ్మె రణం లోకి దిగడానికి సమ్మె సైరన్ కార్మిక సంఘాలు మ్రోగిస్తున్నాయి.
గడిచిన 31 సంవత్సరాల కాలంలో కార్మిక, కర్షక, ఉద్యోగ ప్రజానీకం ఈ నయా ఉదారవాద విధానాల పైనా పోరాడుతూ 20 సార్వత్రిక సమ్మెలు చేసింది. మార్చి 28, 29 న జరగబోయే సమ్మె మాత్రం దేశాన్ని, దేశ సంపదను, ప్రభుత్వ సంస్థలను, ప్రజల ప్రాణాలను దేశ సమైక్యతను కాపాడే సమ్మె అందుకే ఈ సమ్మె నినాదం ” ప్రజల్ని కాపాడండి-దేశాన్నీ రక్షించండి” అని నినదించాలి. అందుకే ఇది “దేశ భక్తియుత సమ్మె”
– ఉకంటి మహేందర్
సబ్ పోస్ట్ మాస్టర్-కెసిక్యాంపు
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు
అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘము – గ్రూప్ – సి
9989928144