– మార్వాడీలను చూసి నేర్చుకుందాం
– ఈరోజు మార్వాడీ.. రేపు రెడ్డి- కమ్మ, వెలమ, బీసీ, దళితులు గో బ్యాక్ అంటారా?
– అందరినీ వెళ్లగొడితే ఉండేదెవరు?.. పాక్ అనుకూల శక్తులా?
– ఇది పాకిస్తాన్ అనుకూలశక్తుల పథకమే
– మార్వాడీలు దేశ ఆర్ధిక శక్తికి మూలాలు
– గోబ్యాక్ మూకలతో గొంతు కలిపితే దేశానికే నష్టం
రాజస్థాన్ లోని మేవార్ ప్రాంతం వాళ్ళందరూ మార్వాడీలే. అందులో అన్ని కులాల వాళ్ళు ఉంటారు.
మన దగ్గర ఒక మామూలు వ్యాపారస్తుడు వంద రూపాయల పెట్టుబడిని…
రెండు రూపాయల లాభంతో, రెండుసార్లు రొటేషన్ చేసి, నాలుగు రూపాయల లాభం సంపాదిస్తే…
వాళ్ళు రూపాయి లాభంతో అదే పెట్టుబడిని, పదిసార్లు రొటేషన్ చేసి పది రూపాయల లాభం సంపాదించగలరు.
అదే మార్వాడీలకి మిగిలిన వాళ్ళకి తేడా!
ఈరోజు మార్వాడి గో బ్యాక్ అన్నారు. రేపు వైశ్యులని, కమ్మోళ్ళను, కాపులను, రెడ్డిలను అంటారు. ఈ సోది మాటలు మాని చేతనైతే వాళ్ళలాగా వ్యాపారం చేయడం మొదలుపెట్టండి.
గడిచిన 22 సంవత్సరాల నుండి వ్యాపార రంగంలో ఉన్నాను.
ఇక్కడి వాళ్ళల్లో నూటికి తొంభైమంది కంపెనీలు ఇచ్చే క్రెడిట్ మీద ఆధారపడి బిజినెస్ చేస్తే… వాళ్ళల్లో నూటికి తొంభైమంది, కంపెనీలకు ముందస్తు పేమెంట్స్ చేసి ఎక్కువ డిస్కౌంట్ పొందుతారు. ఎక్కువ డిస్కౌంట్ అంటే ఎక్కువ లాభం. ఈ విషయం బిజినెస్ తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు.
తాము సంపాదించే దాంట్లో ఖచ్చితంగా కొంత గో రక్షణ, ధర్మం కోసం ఖర్చు పెడతారు మార్వాడీలు.
వాళ్ళల్లో వాళ్ళకి ఎన్ని ఉన్నా… కష్ట సమయాలలో ఒకరికొకరుకలిసి ఉంటారు.
చిన్న వయసు నుండే వ్యాపారంలో ఉంటూ… దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు.
తాము చేసేపనిని ఎటువంటి పరిస్థితిలోనూ ఎదుటివాళ్ళ మీద వదిలేసి జల్సాల కోసం తిరగరు.
అవసరం ఐతే వాళ్ళ పనిలో వాళ్ళు గుమస్తాలుగా చేయడానికి సిగ్గుపడరు.
వీలైనంత వరకూ తమవాళ్ళల్లోనే కొందరిని సాయంగా పెట్టుకుని వాళ్ళని తిరిగి వ్యాపారస్థులుగానే చేస్తారు.
వారి ఐక్యత
వారి కట్టుబాట్లు
వారి జీవన విధానం
వారి అంకితభావం
వారి కష్టించే తత్వం
వారి ఆచారాలు
వారి సాంస్కృతిక జీవనంలో సగం ఐనా ఆచరించి చూపించండి.
వారికి ఓ ప్రత్యేక కులం కట్టుబాట్లు ఉంటాయి. వాటిని 5 ఏళ్ళ పిల్లాడి నుండి 80 ఏళ్ళ ముసలాడి వరకూ ఆచరిస్తారు. పెద్దల పట్ల పిల్లలు గౌరవంగా ఉంటారు. సాంప్రదాయం పాటిస్తారు. హుందాగా గౌరవంగా ఉంటారు.
వయసులో పెద్దవాళ్ళ ముందు పిల్లలు గొంతు ఎత్తరు. కనీసం పెద్దవాళ్ళ ఎదురుగా కూడా నడవరు. వెనకనుండి వెళ్తారు. అంతేకాని వాళ్ళని దాటుకుంటూ నడవరు. పెద్దలు కనపడగానే గౌరవంగా కాళ్లకు నమస్కరిస్తారు.
ఇంటిల్లపాది వ్యాపారానికి అంకితం అవుతారు. నెల రోజులు కూడా వారిలాగా సాత్వికంగా కట్టుబాట్లుతో బ్రతకలేరు… వాళ్ళని గో బ్యాక్ అనే మంద.
వారికున్న ఆత్మగౌరవం.. వారికున్న దేశ భక్తి మనకు లేవు.
ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పధకాలు లేదా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చూడరు. ప్రతీ ఒక్కరూ వ్యాపారంలోనే బతుకుతారు. చిన్న వయసు నుండి కష్టబడే తత్వం అలవాటు చేసుకుంటారు.
మార్వాడీవాళ్ళు వాళ్ళ గురించి గర్వంగా చెప్పుకునే మాట ‘जहां जहां न पहुंचे बैलगाड़ी, वहां वहां पहुंचे मारवाड़ी’. ఎడ్లబండికూడా వెళ్ళలేని చోటుకి మార్వాడీలు వెళ్ళగలరు.
నిజానికి మార్వాడి గో బ్యాక్ అనేది…
తెర వెనుక నుంచి పాకిస్తాన్ ప్రేమికుల ప్లాన్. కానీ మార్వాడి గో బ్యాక్ అంటూ ముందుండేది మాత్రం… సిగ్గు శరం చీము నెత్తురు ఇజ్జత్ మానం లజ్జ లేని మన వాళ్లే.
హైదరాబాద్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అన్ని పాకిస్తాన్ ప్రేమికులతో నిండి పోయాయి. మెల్ల మెల్లగా వారి జనాభా పెంచుకుంటూ పోతున్నారు. అన్ని వ్యాపారాలలో వాళ్లే ఉన్నారు. మన దేశంలో వ్యాపారం చేసి పాకిస్తాన్ జిందాబాద్ అనే జాతిని మాత్రం ఏం అనలేరు ఎవ్వరూ.
మార్వాడిలు లేకపోతే పాకిస్తాన్ ప్రేమికులు అతి బలమైన ఆర్ధిక శక్తి గా మారతారు. ఆ తరువాత పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహకు అందవు.
హిందువులు ఆలోచించండి.
సేకరణ: చైత్ర