-రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది
-అవినీతి,భూ కబ్జాలు,అరాచకాలకు కేరాఫ్ బీఆర్ఎస్
-వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దీవించండి
-కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి
-వచ్చే ఎన్నికల్లో ఖేడ్ లో రికార్డు సృష్టించబోతున్నాం
-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జానవాడే సంగప్ప
నారాయణఖేడ్: కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి జానవాడే సంగప్ప పేర్కొన్నారు. శనివారం అయన సమక్షంలో నేమ్లీమేట్ గ్రామంలో బీఅరేస్, కాంగ్రెస్, పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి దాదాపుగా 55 మందికి పైగా
యువకులు చేరారు. వారికీ పార్టీ కండువా కప్పి సంగప్ప బిజెపి లోకి ఆహ్వానించారు. ఇటీవల గ్రామానికి ముదిరాజ్ సంఘం యువ నాయకుడు మహేష్ ముదిరాజ్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం లేకున్న పార్టీ కండువా కప్పారని అన్నారు. తిరిగి శనివారం సంగప్ప నాయకత్వంలో మహేష్ తిరిగి బిజెపి లో చేరారు.
మహేష్ తో పాటు కుర్మా రాజు, గణపతి, మాసాన్ పల్లి విట్టల్, కే.లక్ష్మణ్, సిహెచ్ లక్ష్మయ్య , ప్రభాకర్, లింగయ్య, రజినీకాంత్, మోహనరెడ్డి, దత్తు, శ్రీకాంత్, ప్రవీణ్, చందు, సుధాకర్‌రెడ్డి, రాజు, వీరేష్, నరేష్, సంగారెడ్డి, ఆదర్శ్ వీరేశం, బ్యాత్తయ్య, పవన్ కళ్యాణ్ తదితరులకు కండువా కప్పి సంగప్ప బిజెపి లోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు సాయిరాం సంజు పాటిల్ పట్నం మాణిక్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.