– రూ.900 కోట్ల డబ్బులు దారి మళ్లాయి
– ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నిమిత్తం తీసుకున్న రుణం ఏమైందో ప్రజలకు తెలపాలి
– ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ జరిగాయా?, లేవా?
– స్కామ్‍లో పీఎఫ్సీ, ఆర్‍ఈసీలోని కొందరు ఈ గోల్ మాల్ లో భాగస్వాములు
– ప్రభుత్వ కార్పొరేషన్ లలోకి ఒక రూపాయి కూడా రాలేదు
– నిజాలే అని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కాగ్ కూడా నిర్ధారించింది
– మాకు అకౌంట్స్ చూపలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
– దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా సమర్థతలేని సర్టిఫికెట్ ఈ రాష్ట్రానికి వచ్చింది
– ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి
– రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం చేసిన ఇంత పెద్ద భారీ స్కామ్ వెలుగులోకి రావాలి
– టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైంది. ఏపీ ప్రభుత్వంలో మరో భారీ స్కామ్ చోటు చేసుకుంది. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీ జరిగింది. రాయలసీమ కరవు నివారణ కార్పొరేషన్ పేరుతో అప్పులు తెచ్చారు. నేరుగా ప్రైవేట్ కంపెనీల ఖాతాల్లోకి రుణాల మళ్లింపు జరిగింది.
సుమారు రూ.900 కోట్ల డబ్బులు దారి మళ్లాయి. ఏ రాష్ట్రంలో జరగని విధంగా నిధుల దోపిడీ జరిగింది. నిధుల దోపిడీపై సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం చాలావుంది. ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నిమిత్తం తీసుకున్న రుణం ఏమైందో ప్రజలకు తెలపాలి. ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ జరిగాయా?, లేవా? చెప్పాలి. స్కామ్‍లో పీఎఫ్సీ, ఆర్‍ఈసీలోని కొందరు ఈ గోల్ మాల్ లో భాగస్వాములుగా వున్నారు. తీసుకున్న రుణానికి చెల్లింపులు జరిపేస్తున్నారు.
ఈ యేడాది మార్చి 29న బ్యాంక్ గ్యారెంటీ ఇస్తూ గెజిట్ జారీ చేస్తే మూడు రోజుల్లో రుణం ఇచ్చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం తీసుకున్న రుణం కన్సాలిటేడె ఫండ్ లోకి రావాలి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన తరువాత మాత్రమే అది బయటికి పోవాలి. బేవరేజెస్ కార్పొరేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఒక కార్పొరేషన్ చేసినప్పుడు కనీసం ఆ కార్పొరేషన్ అకౌంట్ లోకి రావాలి. ప్రభుత్వ కార్పొరేషన్ లలోకి ఒక రూపాయి కూడా రాలేదు. అప్పులు తిరిగి కట్టడం ప్రారంభించారు. అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించిన ఆర్థిక నిర్వహణ పట్ల అనేక లోటుపాట్లు అవకతవకలు జరిగాయి.
ఈ విషయంపై గవర్నర్ ను కలిసి నివేదికలిచ్చాం. ఇవన్నీ నిజాలే అని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కాగ్ కూడా నిర్ధారించింది. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా సమర్థతలేని సర్టిఫికెట్ ఈ రాష్ట్రానికి వచ్చింది. మాకు అకౌంట్స్ చూపలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇలా గోల్ మాల్ కు రాష్ట్ర ఆర్థిక శాఖ నాయకులు తెరతీశారు. వైసీపీ పెద్దల ఆశీస్సులతోనే ఇదంతా జరిగింది.
రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి ఈ ప్రభుత్వం తెరతీసింది. రాయలసీమలో కరువును నివారించడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడతామని భారీగా దోపిడీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి. పనులు ఎక్కడ జరిగాయో ప్రభుత్వం చూపించాలి. జరిగిన కుంభకోణంపై సీబీఐచే విచారణ జరగాలి. సీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం భారీ దోపిడీ జరిగిందనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి.
లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం రూ. 3 వేల కోట్ల అప్పు తెచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అప్పులు తెచ్చింది. స్కామ్‍లో పీఎఫ్సీ, ఆర్‍ఈసీ పాత్ర, ప్రభుత్వ పాత్ర చాలా వుంది. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం చేసిన ఇంత పెద్ద భారీ స్కామ్ వెలుగులోకి రావాలి. సీబీఐ ఎంక్వైరీ ద్వారా మాత్రమే ఇది వెలుగులోకి రాగలదు. ఈ భారీ ఆర్థిక కుట్ర వెనక ఉన్న లోతులు తెలియాలి. నిజాలు వెలుగులోకి రావాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విలేకరుల సమావేశంలో నొక్కి వక్కాణించారు.