హైదరాబాద్: చాలకాలం తర్వాత తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా హనుమంతరావు నియమితులయ్యారు.
పురపాలక శాఖ డైరెక్టర్‌గా టీకే శ్రీదేవి, సీసీఎల్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా మంద మకరందు, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా జెడ్కే హనుమంతు బదిలీ అయ్యారు. దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా హనుమంతుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్‌గా శశాంక, ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్‌గా ఎస్.హరీశ్ బదిలీ అయ్యారు. విపత్తు నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆర్ అండ్ ఆర్, భూసేకరణ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా ఆయేషా మస్రత్, డెయిరీ కార్పోరేషన్ ఎండీగా కె.చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఎస్.దిలీప్ కుమార్, ఎస్సీ అభివృద్ధి కార్పోరేషన్ ఎండీగా ఎస్.క్షితిజ, జీహెచ్ఎంసీ అర్బన్ ఫారెస్ట్రీ అదనపు కమిషనర్‌గా సుభద్రాదేవి, వికారాబాద్ డీఎఫ్ఓగా జి.జ్ఞానేశ్వర్లను బదిలీ చేశారు.
వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్ చక్రవర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. క్రీడాశాఖ సంచాలకులుగా సోనీ బాలదేవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. గిడ్డంగుల కార్పోరేషన్ ఎండీగా కొర్రా లక్ష్మిని బదిలీ చేశారు. కొర్రా లక్ష్మికి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.