– ఆర్వీఆర్‌కు అమరావతిలో కాంట్రాక్ట్‌లు
– ఆయన కిరణ్ వియ్యంకుడి బంధువు
– జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్రంలో చర్చ
– అమరావతి ఇప్పట్లో పూర్తయ్యేది కాదు
– నవ నగరాలు ఏమయ్యాయో చెప్పాలి
– తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లి: అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ఇవాళ ప్రెస్ మీట్ లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అవుతుందని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.
అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైందని తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్ధితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలు అవుతాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
రెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ అనే పదం మీద చర్చ జరుగుతోంది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటా ఈ చర్చ జరుగుతోంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంట. ఉడా, తుడా, గుడా అంటే మాత్రం కనిపిస్తున్నాయా? మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను జగన్‌గారు తెరపైకి తెచ్చారు. ఏ విధంగా ఆయన దీన్ని తెచ్చారో అంతా చూశారు.
ఇప్పుడు కాంట్రాక్టులు కూడా రామెజీరావు కొడుకు కిరణ్ వియ్యంకుడి బంధువు, ఆర్వీఆర్‌కు అక్కడ కాంట్రాక్టులు వస్తున్నాయి. మావిగన్ పేరు ఎప్పుడైతే వచ్చిందో, ఈ కాంట్రాక్టులు, కమీషన్లు ఎక్కడ ఆగిపోతాయోన్నది వారి భయం. అందుకనే ఈ పిచ్చిరాతలు రాస్తున్నారు. 2028–29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయాన్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారు. గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారు.
ఈ 2028–29కి కూడా ఆ ఏడు భవనాలు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే అవీ చేయడు. టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. 2028–29కి ఈ ఏడు బిల్డింగ్ కు పూర్తి చేస్తామన్నారు. నవనగరాలు మాత్రం గాలికి పోయాయి. ఈ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తే చాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో జగన్ మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారు.
ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైంది. ఆయన చెప్పిన తరహాలో చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఆర్దిక పరిస్జితి ఎలా ఉంది ? ప్రభుత్వం చేయాల్సిన పనులకే డబ్బులు లేవు, ఇక రాజధాని ఎలా పూర్తవుతుంది ? కాబట్టి 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేస్తానన్న మాట బూటకంలా ఉంది తప్ప వాస్తవంగా పూర్తి చేసే పరిస్ధితి లేదన్నది అర్దమవుతోంది.
చంద్రబాబు ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తాను అన్నాడు తప్ప, మొత్తం రాజధాని పూర్తి చేస్తానన్న ధైర్యం చేయలేకపోతున్నాడు. అంటే అప్పులు తెస్తారు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు కోట్లు తీసుకుంటాడు తప్ప రాజధాని మాత్రం పూర్తి చేయడు. ఇప్పటికీ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్ధితుల్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దిగివచ్చినా దాన్ని పూర్తి చేయలేడు, చంద్రబాబు అంత పెద్ద ప్లాన్ వేశాడు మరి. 2 లక్షల కోట్లు ఖర్చుపెడిటే నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు వస్తాయి తప్ప నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడితే అప్పటికి చంద్రబాబూ ఉండదు, ఎవరూ ఉండరు.
బీజేపీతో పొత్తుల విషయంలో ఊసరవెల్లి ఎవరో, ప్రత్యేక హోదా విషయంలో ఊసరవెల్లి ఎవరో, రాజధాని మొదట నూజివీడులో వస్తందని, తర్వాత తిరువూరులో వస్తుందని, తర్వాత సత్తెనపల్లె వైపు వస్తుందని, విజయవాడ–గుంటూరు మధ్య వస్తుందని ఇలా రకరకాలుగా రంగులు మార్చిన చంద్రబాబుకు, దానికి మద్దతు ఇస్తున్న ఈనాడు వీళ్లు ఊసరవెల్లులు.
అమరావతికి కులం రంగు పూశారంటున్న చంద్రబాబు.. నిన్న రేణుకా చౌదరి రాజ్యసభలో చెప్పిన మాటలు ఓసారి గమనించాలి. కులం రంగు పులుముకుంది మీరే, మేము కాదు. అదే జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. ఈనాడు కిరణ్ మనుషులు, చంద్రబాబు ముఠాతో కలిసి అమరావతిలో దోపిడీ చేస్తున్నారు. అందుకే జగన్ మీద బురద జల్లుతున్నారు. కానీ అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టే శక్తీ లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే పరిస్దితి లేదు. అందుకే మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివద్ధికి మంత్రం అనేది సుస్పష్టం.
అమరావతి ఎలాగో పూర్తి కాదు, అందులో పెట్టుబడులు పెట్టినా వృథా అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అందుకే ఏంటీ మావిగన్, అమరావతి ఏంటనే చర్చ జరుగుతోంది. గుంటూరు బస్టాండ్ లో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకుంటే అమరావతి గుడికి తీసుకెళ్తారు తప్ప, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నది. డైనమిక్ పవర్ హౌస్ లాంటిది.