-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
-అమ్మవారికి సారె సమర్పించిన ఎంపి కేశినేని శివనాథ్ దంపతులు
విజయవాడ : దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు సోమవారం ఇంద్రకీలాద్రి పై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ సరస్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి బుధవారం విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.. ఆలయానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ దంపతులకి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.
దర్శనానంతరం ఎంపి కేశినేని శివనాథ్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలతో అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఈసందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమన్నారు. జగజ్జనని ఆశీస్సులు, అనుగ్రహం రాష్ట్ర పురోగాభివృద్దిపై, ప్రజలందరిపై వుండాలని వేడుకొన్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తుల అందరికీ అమ్మవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. అదే సమయంలో దర్శనంకు విచ్చేసిన హోమ్ మినిస్టర్ వంగపూలపూడి అనిత ఎంపి కేశినేని శివనాథ్ దంపతులను కలవటం జరిగింది.