-జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష
-ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరాకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారాయణ
అమరావతి: ప్రకాశం జిల్లా మార్కాపురం,పొదిలి మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు..తన నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల లో తాగునీటి ఎద్దడిని అరికట్టాలని మంత్రి నారాయణ ను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు.
ప్రతి ఏటా జూలై రెండవ వారంలో నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి మార్కాపురం, పొదిలి మున్సిపాలిటీలకు నీటిని విడుదల చేస్తారని… దానికంటే ముందుగానే ఈసారి సమస్య వచ్చిందని కందులు నారాయణరెడ్డి మంత్రిగా తెలిపారు..ఎమ్మెల్యే కందుల వినతి తో వెంటనే అధికారులతో సమీక్ష చేశారు మంత్రి నారాయణ.. సచివాలయంలోని రెండో బ్లాక్ లో తన ఛాంబర్ లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మార్కాపురం, పొదిలి మున్సిపాలిటీల అధికారులతో మంత్రి నారాయణ ఈ అంశంపై చర్చించారు.
వెంటనే ట్యాంకర్ల ద్వారా మంచి నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు…రెండు మున్సిపాలిటీల్లో బోర్లు ఉన్నప్పటికీ ఆ నీరు తాగడానికి పనికిరాని విధంగా ఉందని ఇతర అవసరాలకు మాత్రం ఆ నీరు వాడుకోవచ్చని అధికారులు వివరించారు… తాగునీటికి ముందు ప్రాధాన్యత ఇచ్చి అవసరమైనన్ని ట్యాంకర్లను వినియోగించాలని మంత్రి నారాయణ సూచించారు.
ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో ఈ రెండు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. అటు నాగార్జునసాగర్ ఇంజనీరింగ్ అధికారులతో జలవనల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ అంశంపై ఫోన్ లో మాట్లాడారు.. సాగర్లో ప్రస్తుతం నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు.
నాగార్జునసాగర్ లో వాస్తవ పరిస్థితి, తాగునీటి సరఫరా పై వివరాలు తీసుకురావాలని అధికారులను మంత్రి నిర్మల రామానాయుడు ఆదేశించారు. మార్కాపురం, వదిలే మున్సిపాలిటీలకు తాగునీరు అందించాలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో హాజరుకావాలని మంత్రి ఆదేశించారు