Suryaa.co.in

Telangana

భట్టికి వైద్య పరీక్షలు

ప్రజా సమస్యల పరిష్కారానికై పాదయాత్ర చేస్తున్నసీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, బాణాపురం గ్రామంలో అపోలో టెలి క్లినిక్ వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించారు.

కాంగ్రెస్ కుటుంబంతో సేద
ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 6వ రోజుకు చేరుకుంది. బాణాపురం నుంచి వల్లభి గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో మధ్యాహ్నం మామిడితోటలో భోజనం చేశారు. అనంతరం చెట్ల కింద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సేద తీరారు.

బోనమెత్తిన బాణాపురం
ముది గొండ మండలం బాణాపురంలో శుక్రవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. కోలాట నృత్యాలతో సందడి చేశారు. గ్రామంలోని రామాలయంలో
bhatti-kh3 ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అపోలో టెలీ క్లినిక్ ఆస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళా కాంగ్రెస్ నేతలు హారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా ప్రజలు తమ సమస్యలను సీఎల్పీ నేతకు వివరించారు.

LEAVE A RESPONSE