– మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్: మీనాక్షి నటరాజన్ మీరు నిజమాబాద్ జిల్లాలో పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజలకు చెప్పిన గ్యారంటీలు ఏ ఒక్కటైన సక్రమంగా అమలు అయ్యిందా ? ఆర్మూర్ లో చేస్తున్న పాదయాత్ర లో జిల్లా ప్రజలకు మీనాక్షి నటరాజన్ ,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ , రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు కాలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయినారు.ప్రజలకు ఆయన మీద నమ్మకం. పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుని ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కి లేదు అందుకే మీనాక్షి నటరాజన్ అనే కొత్త ముఖాన్ని ముందర పెట్టి పాదయాత్ర పేరుతో ప్రజల్ని రెండవ సారి మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది.
రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.సగం మందికి 2 లక్షల రుణమాఫీ కాలేదు . నిజమాబాద్ జిల్లాలో సుమారు 2 లక్షల 3 వేల రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 1 లక్ష 3 వేల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది.మిగతా లక్ష రైతులకు కాలేదు..జిల్లాలో ఇంకా లక్ష మంది రైతులకు 2 లక్షల ఋణామాఫీ అంటే సుమారు 2000 కోట్లు బాకీ ఉన్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం.
అన్ని రకాల వడ్లకు 500 బోనస్ అన్నారు.మాట మార్చి సన్న వడ్లకు అంటున్నారు. బోనస్ ఇచ్చినారా ? నిజాంబాద్ జిల్లాలో ప్రతి పంట కు సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తున్నారు,ఒక్క సీజన్ కు 8 లక్షల మెట్రిక్ టన్నుల పంటకు క్వింటాలుకు 500 బోనస్ చొప్పున 400 కోట్లు ఇవ్వాలి.మీరు అధికారం లోకి వచ్చిన తర్వాత 3 సీజన్ లకు కలిపి బోనస్ 1200 కోట్లు ఇవ్వాలి.కానీ 200 కోట్లు మాత్రమే ఇచ్చారు.
వడ్ల బోనస్ కింద జిల్లా రైతులకు ఇంకా 1000 కోట్లు బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం.
రుణమాఫీ,రైతు భరోసా,బోనస్, పసుపు రైతులకు కలిపి కేవలం నిజమాబాద్ జిల్లా రైతులకే మీ కాంగ్రెస్ ప్రభుత్వం 4500 కోట్లు బాకీ ఉంది. మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో నిజమాబాద్ జిల్లా రైతులకు సమాధానం చెప్పాలి. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రియాంక గాంధీ ని తీసుకొచ్చి హామీలు ఇప్పించారు. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు..ఒక్కరిక్కన్న ఇచ్చారా ?
5 లక్షల విద్యా భరోసా కార్డు ,విద్యార్థినులకు స్కూటీ లు ఇస్తామన్నారు ఒక్కటన్న అమలు అయ్యిందా ? మీనాక్షి నటరాజన్ పాదయత్రలో జిల్లా నిరుద్యోగ యువతకు,విద్యార్థులకు సమాధానం చెప్పాలి. కామారెడ్డి బిసి డిక్లరేషన్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ని తీసుకొచ్చి ప్రజలకు హామీలిచ్చారు
పథకాలు కాకుండానే ప్రత్యేకంగా బీసీ ల కోసం 5 ఏండ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తాం అన్నారు.20 నెలల్లో సుమారు 30000 కోట్లు ఖర్చు చేయాలి. చేసినారా? అన్ని ప్రభుత్వ కాంట్రాక్ట్ లో 42 శాతం బిసి లకు కేటా ఇస్తామన్నారు.ఇచ్చారా? .మీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లి ఈ హామీలు అమలు అయ్యేలా చూడండి..అప్పటి వరకు మీ పాదయాత్ర విరమించుకోండి. మీరు హామీలు అన్ని అమలు అయ్యాకనే పాదయాత్ర చేయండి అని మీనాక్షి నటరాజన్ గారిని డిమాండ్ చేస్తున్న