Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి ఆనంతో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల భేటీ

అమరావతి: దేవాలయాల ఖ్యాతిని ఇనుమడింపజేసేలా వంశపారంపర్య ధర్మకర్తల పనితీరు ఉండాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రి రామనారాయణ రెడ్డి పలు ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలను కలిశారు.

భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాల వైభవ పరిరక్షణకు వంశపారంపర్య ధర్మకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి కోరారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్. సత్యనారాయణ, అదనపు కమీషనర్ రామచంద్రమోహన్, పలువురు వంశపారంపర్య ధర్మకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE