Suryaa.co.in

Andhra Pradesh

విశాఖలో కాపు నేతల కీలక భేటీ

– ఫోరం ఫర్‌ బెటర్‌ ఏపీ పేరిట వేదిక

విశాఖలో కాపు నేతల కీలక భేటీ కి ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ రిటైర్డ్‌ అధికారులు, రాజకీయ నేతలు హాజరైనారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు, తమిళనాడు మాజీ చీఫ్‌ సెక్రటరీ రామ్మోహన్, బోండా ఉమా, గంటా శ్రీనివాసరావు, మాజీ ఐఏఎస్‌ అధికారి భాను హాజరయ్యారు.

గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుతం అమలవుతున్న వాటిపై చర్చించారు. కాపు రిజర్వేషన్లు, సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేశారని నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల
samayam-telugu కోసం గతంలో రూ.3 వేల కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం నిధుల కేటాయింపులు లేవని కాపు నేతల ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల రిజర్వేషన్లపై వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడడం లేదని మండిపడ్డారు. కాపుల సంక్షేమంపై ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.

కాపు కులంతో పాటు రాష్ట్రం కూడా సర్వనాశనం అవుతుందని నేతల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కాపు నేతలు మౌనంగా ఉంటున్నారని సమావేశంలో నేతలు దుయ్యబట్టారు. ఫోరం ఫర్‌ బెటర్‌ ఏపీ పేరిట
Ap-main8a ముందుకు వెళ్లాలని సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు.ప్రతి జిల్లాలో కమిటీలను నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జిల్లాకు నలుగురిని నియమించి కాపు సంఘాలను ఏకం చేయాలన్నారు.

LEAVE A RESPONSE