Suryaa.co.in

Andhra Pradesh

బాబు నివాసంలో ఎన్డీయే నేతల సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన, బీజేపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు  నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి , జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ , మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్  సమావేశం అయ్యారు. కూటమి నేతల ప్రచారం, ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు.

ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై వీరు చర్చించే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వడం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు.

LEAVE A RESPONSE