Suryaa.co.in

Telangana

నవంబర్ రెండవ వారంలో హుస్నాబాద్ లో మెగా ఫారిన్ జాబ్ మేళా

– అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారి స్కిల్స్ ఆధారంగా జాబ్స్
– వివిధ దేశాల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేసేలా టాంకాం ప్రతినిధులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..
– హుస్నాబాద్ నిరుద్యోగ యువత ఫారిన్ జాబ్ మేళా కు ఎన్ రోల్మెంట్ చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైద‌రాబాద్: అభివృద్ధి చెందిన దేశాల్లో భారీ వేతనాలతో ఉన్న ఉద్యోగ అవకాశాలు పొందేలా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలోని వారి ఛాంబర్ లో టాంకాం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

హుస్నాబాద్ లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వివిధ రంగాల్లో వారికి ఉన్న స్కిల్స్ ఆధారంగా వివిధ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మెగా ఫారిన్ జాబ్ మేళా ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబర్ మొదటి వారంలో జరిగే జాబ్ మేళా కోసం మండలాల్లో అవగాహన కల్పించాలని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత డేటా సేకరించి వారికి ఆసక్తి ఉన్నా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

LEAVE A RESPONSE