Suryaa.co.in

Andhra Pradesh

కుమిలిపోతున్న మేకపాటి సెక్యూరిటీ

ప్రతిక్షణం దివంగత మంత్రి మేకపాటి వెంటే పరుగులెత్తి ప్రయాణించిన వ్యక్తిగత సిబ్బంది ఆయన ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేని పరిస్థితి. నిన్నటి వరకూ మర్రిచెట్టులా గువ్వలకు నీడనిచ్చి ఇలా అర్ధాంతరంగా కూలిపోవడంతో దిక్కుతోచని పక్షుల్లా విలపిస్తున్న వైనం. కంటి నిండా నీరు , గుండె నిండా బాధ మనసు లోతుల్లో నుంచి తన్నుకుని వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని మంత్రిగారి చివరి సంస్కారాల పనులు చేస్తున్న వైనం. పాతికేళ్లకు పైగా మంత్రి మేకపాటి కుటుంబం వెంటే, మంత్రి మేకపాటితో కలిసి గడిపిన క్షణాలని తలుచుకుని కుమిలి పోయి ఏడుస్తున్న సిబ్బంది. మంత్రి మేకపాటితో అనుబంధాన్ని ఇలా అకస్మాత్తుగా అర్ధాంతరంగా ముగించాల్సి రావడంతో, తట్టుకోలేక పోతున్న దివంగత మంత్రి మేకపాటి సిబ్బంది. మేకపాటి మృతి చెందిన క్షణం నుంచీ ఆయనను వెన్నంటి ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనతో గడిపిన తమ అనుభవాలను గుర్తు చేసుకుని కుమిలిపోతున్న తీరు అందరినీ కంటతడిపెట్టిస్తోంది.

LEAVE A RESPONSE