Suryaa.co.in

Telangana

28 నుండి జూలై మూడో తారీకు వరకు మేరా పోలింగ్ బూత్ సబ్సే మజ్బుత్

-అందరూ పోలింగ్ బూత్ లో పనిచేయాలి
-27న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
-బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్

భారతీయ జనతా పార్టీ ఈనెల 28 నుండి జూలై మూడో తారీకు వరకు మేరా పోలింగ్ బూత్ సబ్సే మజ్బుత్ కార్యక్రమంలో భాగంగా నేడు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, యన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు జిల్లా ఇన్చార్జులు ముఖ్య నాయకులతో సమావేశం కావడం జరిగింది.

అన్ని పోలింగ్ బూత్ ల కంటే నా పోలింగ్ బూత్ లో బిజెపి శక్తివంతమైనది అని పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న వారితో సహా , అందరూ పోలింగ్ బూత్ లో పనిచేయాలని, ప్రతి ఒక్కరు పాల్గొనాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు& పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈనెల 27న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉదయం సుమారు 11 గంటలకు ప్రసంగించనున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించి మండల, పోలింగ్ బూత్ ల స్థాయిలో ప్రజలు వీక్షించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మేరా పోలింగ్ బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రముఖ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఐదుగురు సభ్యులు(5)గా శ్రీ బద్దం మహిపాల్ రెడ్డి, శ్రీ నరేందర్, డా. మాలతి, యశ్పాల్ గౌడ్, క్రాంతి కుమార్ వ్యవహరిస్తారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ 1975 (అత్యయిక స్థితి 1975లో ) విదించి దేశంలో ప్రజాస్వామిక వాదులను, జాతీయ వాదులను, ప్రతిపక్ష నేతలను అటల్ బిహారి వాజ్పేయి తో సహా దేశంలో ఉన్న లక్షలాది మందిని అక్రమంగా క్రూరంగా అరెస్టు చేసి నిర్బంధాలకు గురి చేసిన జూన్ 25వ తేదీని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఎమర్జెన్సీ డేని చీకటి దినంగా భావిస్తూ నేటి తరానికి నాటి ఎమర్జెన్సీ డే అకృత్యాలను తెలియజేస్తూ కార్యక్రమాలను చేపట్టవలసిందిగా ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కోరారు.

LEAVE A RESPONSE