– రేవంత్ రెడ్డి పతనానికి, పల్లె ప్రజల తిరుగుబాటు నిదర్శనం
– తెలంగాణ జనం ఆయనను బండకేసి కొట్టారు
– పెన్షన్లు, రుణమాఫీకి పైసలు లేవు కానీ.. మెస్సీ కోసం, అందాల పోటీల కోసం రేవంత్ రెడ్డి వందల కోట్లు ఖర్చు చేశాడు
– రెండేళ్లలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
– సచివాలయం పైన ఎగిరేది గులాబీ జెండానే
– మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం లో మాజీ మంత్రి హరీష్ రావు
మెదక్ : ఇది మామూలు విజయం కాదు.. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచ్లు 80 నుండి 90 శాతం గెలుస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ 40 శాతం సర్పంచ్లను గెలిచింది. అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరిగిండు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జిల్లా జిల్లాలు తిరిగిండు. అయినా కూడా జనం బండకేసి కొట్టారు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేలా ఇచ్చారు తెలంగాణ పల్లె ప్రజలు.
రెండు బతుకమ్మ చీరలకు ఇచ్చింది ఒకటే. ఇచ్చింది కూడా సగం మందికి. ఆ చీరలు కట్టుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అడిగింది. గుద్దుడు గుద్దుతే 4000 సర్పంచ్లను బీఆర్ఎస్ గెలిచింది. సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గూబ గుయ్యిమనిపిచ్చిండ్రు ప్రజలు. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయితది రేవంత్ రెడ్డికి. బీఆర్ఎస్ సర్పంచ్ విజయం చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు.
90 శాతం గెలవాల్సిన అధికార పార్టీ 50% లోపే పరిమితమైంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ అని మోసం చేసిండు. రైతుబంధు అని మోసం. రైతులకు యూరియా ఇయ్యకుండా తిప్పలు. రుణమాఫీ సగం మందికి కూడా కాలే. సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టినవ్. దళిత బంధు బంద్ అయింది. కేసీఆర్ కిట్టు బంద్ అయింది. చెరువుల్లో చాపలు వేస్తలేరు. గొర్రెల పంపిణీ పథకం బంద్ అయింది. ఆడోళ్ళకి ఫ్రీ బస్ అని మొగవాళ్ళకి డబల్ టికెట్ కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు వడ్లమ్మడానికి ఎప్పుడైనా తిప్పలు అయిందా. యూరియా కావాలంటే తిప్పలు అయినాయా.? పోలీసులు ఇబ్బందులకు గురి చేసినా ప్రజలు బీఆర్ఎస్ వైపున్నరు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
హైదరాబాద్ సెక్రటేరియట్ పైన ఎగిరేది గులాబీ జెండా. మెదక్ నియోజకవర్గంలో ఎగిరేది కూడా గులాబీ జెండానే. మెదక్ నియోజకవర్గానికి నేను కేసీఆర్ సార్ అండగా ఉంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక సర్పంచ్ కి ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. మీరేం బాధపడకండి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక కూడా మీరే సంవత్సరం సర్పంచ్. మీ గౌరవం కాపాడుకుంటాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని వంగి వంగి దండాలు పెట్టి ఓట్లు అడిగిండు.
యూరియా దొరికినప్పుడు ఎందుకు కుర్చీ వేసుకుని కూర్చోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. పగలు రాత్రి రైతులు లైన్లో నిల్చోని యూరియా కోసం తిప్పలు పడ్డప్పుడు ఎందుకు కుర్చీ వేసుకుని కూర్చోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గురుకులాల్లో పురుగులన్నం మాకొద్దని రోడ్లపై ధర్నా చేసినప్పుడు ఎందుకు కుర్చీ వేసుకొని కూర్చోలేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొననప్పుడు కుర్చీ వేసుకొని కూసోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఎందుకు ఇస్తలేరని ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ముంగట కుర్చీ చేసుకొని కూర్చోలేదు.
అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద 60000 బాకీపడ్డాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చొని వసూలు చేయాల్సింది పోయి కుర్చీలు వేసుకొని కూర్చుని ఓట్లు అడుగుతారా? ప్రజలు తెలివైనోళ్లు. మిమ్మల్ని బండకేసి కొట్టారు.. బీఆర్ఎస్ ని గెలిపించారు.
రేవంత్ రెడ్డి.. ఫుట్ బాల్ షోకుల కోసం ఐదు కోట్లతో గ్రౌండ్ కట్టించుకోవడం కాదు. మెస్సీతో ఫుట్ బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు చేసినవ్. అందాల పోటీ కోసం 100 కోట్లు ఖర్చు చేసినవ్. నువ్వు నీ మనుమడు క్రికెట్ ఆడడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేయి.. అందాల పోటీలు పెడతా.. వాళ్ళని చూసుకుంటూ మురిసిపోతా అంటాడు రేవంత్ రెడ్డి.
మన సర్పంచ్లను వార్డు మెంబర్లను ఎవరైనా ఇబ్బంది పెట్టితే నాకు ఒక మెసేజ్ పెట్టండి. నేను డైరెక్ట్ గా మీకు అండగా ఉంటా. మీ జోలికొస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు.. అధికారులు న్యాయంగా, ధర్మంగా పనిచేయాలి. ఏకపక్షంగా పనిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ పని పడతాం.