Suryaa.co.in

Andhra Pradesh

క్రీడా శాఖ మంత్రి మండిపల్లిని కలిసిన పరుగుల వీరుడు

– పరుగుల వీరుడు హిమతేజను అభినందించిన మంత్రి

విజయవాడ: తిరుపతి జిల్లా గూడూరు కు చెందిన వి. హిమాతేజ దుబాయిలో జరిగిన అండర్-20 జూనియర్ ఏసియన్ గేమ్స్ లో 4×100 మీటర్ల రీలే పోటీలలో కాంస్య పతకం సాధించాడు. విజయవాడ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి కాంస్య పతాకాన్ని మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.

కాగా హిమతేజ 100 మీటర్ల పరుగుపందెంలోను 4×100 మీటర్ల రిలే పోటీలలో అంతర్జాతీయంగా రెండు పతాకాలు, జాతీయంగా 5 పతాకాలు, రాష్ట్ర స్థాయిలో 9 పతకాలు సాధించారని తెలిపారు. దేశం తరఫున పోటీల్లో పాల్గొంటున్న ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు అన్ని విధాల సహకారం అందించి క్రీడలలో రాణించేందుకు ప్రోత్సాహం కల్పించాలని మంత్రికి విన్నవించారు. మంత్రి మాట్లాడుతూ నూతన క్రీడ పాలసీ ద్వారా క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని వారికి భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE