– జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఖచ్చితంగా ఏపీలో పాగా
– ఏనాడైనా హరీష్ .. కేసీఆర్ అల్లున్ని అన్నాడా
– 2014కు ముందు సజ్జల ఎక్కడ?
– సజ్జల.. తల్లిని కొడుకుని అన్నని చెల్లిని విడదీసినట్టుగా ఇక్కడా చేస్తామంటే నడవదు
– అమరావతి నుండి హైదరాబాద్లోకి వలసలు వస్తున్నారు
– అనవసరంగా మాజోలికి రావొద్దు
– టీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం, కేసీఆర్ మాకు పెద్ద
– ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి అమర్నాథ్ కు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్
ఏపీ ప్రభుత్వ వైపల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టవద్దని ఏపీ ప్రభుత్వ పెద్దలకు మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావును, కేసీఆర్ని విడదీసేలా ఏపీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయన, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రుష్నారెడ్డి చేస్తున్న ప్రకటనలపై విరుచుకుపడ్డారు.
యావద్దేశం కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటుందని, మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ రాష్ట్రాల్లో కేసీఆర్ నాయకత్వం కావాలని ప్లెక్సీలు వెలిసిన వార్తల్ని ప్రస్తావించిన గంగుల, కేసీఆర్ సారథ్యంలోని జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఖచ్చితంగా ఏపీలో పాగా వేస్తామన్నారు.
టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిదని, కేసీఆర్ గారు ఆ కుటుంబానికి తండ్రిలాంటి వారన్నారు, మా కుటుంబంలోంచి ఒక్కర్ని వేరుచేసే కుట్రలు ఫలించవన్నారు, బీజేపీకి బీటీంలా పనిచేస్తూ, ఎదురించే దైర్యం లేకుండా రైతుల పొట్టకొట్టేలా మీటర్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం ఎక్కడా… దైర్యంగా బీజేపీని ఎదిరించిన కేసీఆర్ ఎక్కడా అని ప్రశ్నించారు. పాలనా వైపల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుటుంభంపై కుట్రలకు దిగారన్నారు. మా సింగరేణిలో, కరెంటులో మీ చొరబాటేంటన్నారు, దేశానికి మార్గదర్శకంగా ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వైసీపీ జతకలిసిందన్నారు.
గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల కన్నా తెలంగాణ పథకాలు ఎలా అదర్శమో అలాగే ఏపీ విషయంలోనూ హరీష్ రావు మాట్లాడారని దీన్ని ఎదుర్కునే దమ్ము లేకనే వ్యక్తిగత హననం చేస్తున్నారన్నారు, ఏనాడైనా హరీష్ రావ కేసీఆర్ అల్లున్ని అన్నాడా అని ప్రశ్నించిన మంత్రి కొడుకనే చెప్పాడన్న విషయాన్ని గుర్తచేసారు. 2014కు ముందు సజ్జల ఎక్కడున్నారని, జగన్ కుటుంభంలో ఉడుములా చేరి తల్లిని కొడుకుని అన్నని చెల్లిని విడదీసినట్టుగా ఇక్కడా చేస్తామంటే కుదరదన్నారు.
అమరావతి నుండి హైదరాబాద్లోకి వలసలు వస్తున్నారని, ఏపీ నుండి తెలంగాణకు వచ్చిన వాళ్లను అడగండి తిరిగిరమ్మని కనీసం వస్తారా అని ప్రశ్నించారు, సజ్జల ఏపీ ప్రభుత్వ సలహాదారని, ఆయన వాళ్లకు 3,4 రాజదానుల కోసం సలహాలిచ్చుకొమ్మని తెలంగాణ వ్యవహరాల్లో తలదూర్చొదని ఘాటుగా బదులిచ్చారు మంత్రి గంగుల కమలాకర్.తెలంగాణ అంటేనే బహుజనుల గడ్డ అని, బహుజనుల బందు కేసీఆర్ ని, మా వ్యవహారాల్లో తలదూరిస్తే వదిలేది లేదన్నారు మంత్రి గంగుల.ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు మేయర్ సునీల్రావు, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామక్రష్ణారావు, ముఖ్య నేతలు చల్లా హరిశంకర్, అనిల్ పాల్గొన్నారు.
పచ్చని సంసారంలో చిచ్చు పెట్టేలా జగన్ ప్రభుత్వం చూస్తోంది. జగన్ పార్టీ బీజెపికి బి పార్టీగా నిలుస్తోంది. సజ్జల,అమర్నాద్ రెడ్డి టిఆర్.యస్ కుటుంబం, హరీష్ రావుపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు సజ్జల మాతో పెట్టుకుంటున్నారు? మా సంగతి తెలియదా మీకు గతంలో చూసారు మళ్ళా చూస్తారా? సజ్జల రామకృష్ణ బుద్ధి కుటుంబాల మధ్య చిచ్చుపెట్టేది. వైయస్ కుటుంబంలోకి వచ్చి తల్లిని కొడుకుని, చెల్లిని అన్నను విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తుండు. కేసీఆర్ కుటుంబంను విడగొట్టాలనుకున్నా ఏమి చేయలేవు సజ్జల.జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది వలసలు తెలంగాణకు పెరిగాయి. సజ్జల ప్రస్టేషన్ లో ఏమి మాట్లాడుతున్నాడో తెలియట్లేదు.భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ లో ఎక్కువ పథకాలు ఉన్నాయని హరీష్ రావు అన్నారు.ఆయనను పర్సనల్ గా ఎందుకు టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నారు?తెలంగాణ మీద టి ఆర్ యస్ మీద ఎందుకు విషం చిమ్ముతున్నారు?
మా ముఖ్యమంత్రిపై మా ప్రభుత్వం జోలికి వస్తే దాడులు చేస్తాం. తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మేము రెచ్చిపోక ముందే మా జోలికి రాకండి.కేసీఆర్ పై తెలంగాణ ప్రభుత్వం పై మాట్లాడే ఎపి మంత్రులకు కబడ్ధార్.కేసీఆర్ కుటుంబం అంటే శరీరంలోని అవయవాలు లాంటి వాళ్ళము విడదీయలేము.