– ఎవరు ఫేక్ నా కొడుకులో.. రాష్ట్రానికి, సమాజానికి బాగా తెలుసు
– తన తండ్రి, తాతల చరిత్ర ఏమిటో లోకేష్ తెలుసుకుంటే మంచిది
– బాబు కుటుంబానికి ఉన్న క్రెడిబులిటీ, క్యారెక్టర్ ఏమిటో అందరికీ తెలుసు
– గతంలో చంద్రబాబు పిక్ పాకెట్లు కొట్టుకునే వాడు అని ఎవరిని అడిగినా చెబుతారు..
– బాబు తండ్రి రైతుల పొలాల్లో రాత్రిళ్ళు వేరు శెనగ బస్తాలు ఎత్తుకెళ్ళేవాడు
– రాష్ట్రంలో బాబు జన్మించడమే శాపం.
– బాబు, లోకేష్ లు అఖిల భారత దరిద్రానికి జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు
– అసలు లోకేష్ అనే వాడు ఎవడు.. అతను ఎక్కడ గెలిచాడు, ఏ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడు?
– రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బాబు ఆస్తి ఎంత, ఇప్పుడెంత.. ?
-ఏటా సగటున 14 లక్షల టన్నుల ధాన్యం అదనపు ఉత్పత్తి
– కోఆపరేటివ్ వ్యవస్థ పటిష్టానికి మెరుగైన చర్యలు
– ఆర్బీకేలకు దేశ,విదేశాల నుంచి ప్రశంసలు
– బాబు బకాయి పెట్టిన రైతు ఆత్మహత్యల పరిహారాన్ని కూడా మేము ఇచ్చాం
– కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలని అన్నవాళ్ళా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడేది..?
– మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి
చంద్రబాబు, లోకేష్ లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి ఢిల్లీలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “అసలు లోకేష్ అనేవాడు ఎవడు, ఎక్కడ గెలిచాడు, ఏ ప్రజా ఉద్యమాల నుంచి వచ్చాడు, వార్డు మెంబరుగా కూడా గెలవనటువంటి వాడు నెల్లూరు వచ్చి, ముఖ్యమంత్రిని, మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేను ఫేక్ నా కొడుకులు.. అని నోటికొచ్చినట్లు మాట్లాడతాడా.. ?, ఇప్పటికైనా లోకేష్ వళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకోవాలి..”అంటూ కాకాణి మండిపడ్డారు. ఫేక్ నా కొడుకులు ఎవరో రాష్ట్ర ప్రజలకు, సమాజానికి బాగా తెలుసు అన్నారు. చంద్రబాబు కుటుంబానికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటో, క్యారెక్టర్ ఏమిటో అందరికీ తెలుసునన్నారు. అటువంటి వీళ్ళు జగన్ గారి కుటుంబం గురించి మాట్లాడటానికి అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. మీ మాదిరిగా మేమూ మాట్లాడితే.. మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని సూటిగా ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు నాయుడు పిక్ పాకెట్లు కొట్టుకునే వాడు అని ఆ జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని విమర్శించారు. బాబు తండ్రి ఖర్జూరనాయుడు రాత్రి వేళల్లో రైతుల పొలాల్లో ఉంచిన వేరు శెనగ బస్తాలను దొంగలించేవాడని కాకాణి దుయ్యబట్టారు. చంద్రబాబు పుట్టుకే.. ఈ రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ లు తెలుగుదేశం పార్టీకి కాదని, అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా తయారయ్యారని తూర్పారబట్టారు. మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
లోకేష్ ఎవడు?
అసలు లోకేష్ అనేవాడు ఎవడు? వాడేమైనా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినవాడా? ప్రజాదరణ ఉన్నవాడా? వాడేమైనా ఉద్యమంలో పాల్గొన్నవాడా? ఎవడు వాడు? రూపాయి బిళ్ల నెత్తిమీద పెడితే పావలా విలువ చేయనటువంటివాడు ఫ్రస్ట్రేషన్‌తో ఏదో మాట్లాడితే నా స్థాయిలో నేను స్పందించడం అనేది అవమానకరంగా భావిస్తాను.. అని మీడియా ప్రశ్నలకు సమాధానంగా మంత్రి కాకాణి చెప్పారు.
– చంద్రబాబు నాయుడు తన కొడుక్కి ఎలాంటి సంస్కారం నేర్పించాడంటే… ఆ పిల్లాడు ఫేక్ నా కొడుకులు.. అని వాగుతున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి కొడుకు, ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నవాడు… బహిరంగ వేదిక మీద మాట్లాడేటప్పుడు వళ్ళు, నోరు అదుపులో ఉండకపోవడం సిగ్గుచేటు. ఫేక్ నా కొడుకులు.. అన్న పదం ఎంత అభ్యంతరకరమైనదో అందరికీ తెలుసు. అసలు ఫేక్ నా కొడుకులు ఎవరనేది రాష్ట్ర ప్రజలుకు బాగా తెలుసు. ఈ సమాజానికి తెలుసు. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
– బాధాకరమైన విషయం ఏంటంటే నారా లోకేష్ ఫ్రస్ట్రేషన్‌లో ఏవేవో మాట్లాడుతున్నాడు. నెల్లూరులో అతడి పర్యటనకు ఎంతమంది వచ్చారు?. వంద మంది కూడా లేరు. బాధితుల వద్దకు వెళితే వాళ్లు అయ్యా మా దగ్గరకు రావద్దంటూ మొహం చాటేస్తున్నారు. అసలు ఎందుకంత హైరానా, ఆత్రుత, ఆక్రోశ పడుతున్నారంటే దానికి కారణం ఫ్రస్ట్రేషనే. ఈసారి అయినా మనం అధికారంలోకి వద్దామనుకుంటే అవకాశం లేకుండా పోతోందనే ఫ్రస్ట్రేషన్‌లో ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ లాంటి పనికిమాలినవాళ్లు అఖిల భారత దరిద్రపు సంఘానికి జాతీయ, అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేయాల్సిందే తప్ప, పార్టీలకు పనిచేసే స్థాయి లేనటువంటివాళ్లు.
నెల్లూరు జిల్లాకు వచ్చిన వాడు, వచ్చిన పని చూసుకోకుండా మా ముఖ్యమంత్రిగారిపై నోరు పారేసుకున్నాడు. ఏమాత్రం సంబంధం లేని జిల్లా మంత్రిగా ఉన్న నన్ను తూలనాడాడు. అక్కడ ఉన్న శాసనసభ్యుల్ని, క్రిందిస్థాయి నాయకుల్ని నోటికొచ్చినట్టు తిట్టాడు. నీ పర్యటన కేవలం మమ్మల్ని తిట్టడానికే అయితే.. దానికోసం కావలికి వచ్చి తిట్టాల్సిన పనిలేదు కదా. మంగళగిరిలో మీ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టి రోజూ తిడుతూనే ఉన్నారుగా. మా ముఖ్యమంత్రి గారి కుటుంబసభ్యులపైన కూడా అడ్డగోలు విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా.
బాబు తండ్రి వేరుశెనగ బస్తాలు దొంగలించేవాడు
చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి మేం మాట్లాడితే… వాళ్ళు తలలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి. దీనిపై ఎవరైనా చర్చకు రండి.. మాట్లాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎక్కడ నుంచి వచ్చారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జురనాయుడు రాత్రి సమయాల్లో అందరూ నిద్రపోతుండగా, రైతుల పొలాల్లో ఉండే వేరుశెనగ బస్తాలు దొంగతనంగా ఎత్తుకువెళ్లేవాడు. అవునా కాదా చెప్పమనండి? చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందే ఆయనకు ఉన్న ఆస్తిపాస్తుల గురించి చెప్పమనండి?
బాబు కుటుంబం క్రెడిబులిటీ, క్యారెక్టర్ ఏమిటి?
చెప్పకూడదు కానీ, చంద్రబాబు నాయుడు చివరకు చేపలు అమ్ముకుని జీవనం సాగించే.. ఒక అమ్మాయిని మోసం చేసి, ఆమె దగ్గర డబ్బులు తీసుకుని చదువుకుని ఎన్టీఆర్ కుమార్తెతో పెళ్లి అయిన తర్వాత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, టీడీపీని హస్తగతం చేసుకుని, ముఖ్యమంత్రి అయ్యారే తప్ప ఆ కుటుంబానికి ఉన్నక్రెడిబులిటీ, క్యారెక్టర్ గురించి. గతంలో చంద్రబాబు పిక్‌పాకెట్‌లు కొట్టుకునేవాడా, కాదా అనేది ఆ జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. ముందుగా లోకేష్ తన గురించి, తన తండ్రి, తాతల గురించి తెలుసుకుంటే మంచిది. అది చేయకుండా ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడటం సంప్రదాయం, పద్ధతి కాదు. ఈ వైఖరిని ఇలాగా కొనసాగితే మంచిది కాదు.
– చంద్రబాబు నాయుడు తన కొడుకును జాగ్రత‍్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డిగారు పరిపాలన పారదర్శకంగా ఉంది కాబట్టే… అంబేడ్కర్‌గారి రాజ్యాంగం అమలు అవుతుంది కాబట్టే లోకేష్ కావలి వచ్చి వెళ్లాడు. ఆ పరిపాలన, ఆ రాజ్యాంగం అమలు కాకుంటే లోకేష్ అనేవాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికైనా లోకేష్ ఒళ్లు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. నోరుంది కదా అని అందర్నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను అంటే, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమాజంలో ఫేక్ నాకొడుకులు ఎవరో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇలాంటి వాటిపై స్పందించాల్సి రావడం దురదృష్టకరం. ఆ మాటలు విన్నప్పుడు ఆవేశం వస్తుంది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడులాంటి నీచ చరిత్ర కలిగిన కుటుంబం ఆంధ్రరాష్ట్రంలో మరొకటి లేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు జన్మించడమే ఆంధ్రరాష్ట్రానికి శాపం.
కోఆపరేటివ్ వ్యవస్థ బలోపేతం
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాల సహకార శాఖ మంత్రులతో ఒక సదస్సు నిర్వహించారు. ప్రధానంగా ఈ సదస్సులో ఆయన అనేక రకాల సూచనలు, సలహాలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో సహకార సంఘాలకు ఒక పాలసీని ఏర్పాటు చేసి అమల్లోకి తీసుకురావాలనే ఆలోచన చేశారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోవిధంగా సహకార వ్యవస్థలు, చట్టాలు అమలు అవుతున్నాయని… దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని, ఒకే వ్యవస్థను అమలు చేస్తే బాగుంటుందని అమిత్ షా చెప్పారు. దానితో పాటు ప్రతి పంచాయతీ పరిధిలో కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను విస్తరించాలని ఆలోచన కూడా ఉన్నట్లు చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా సాగుచేసే సేంద్రీయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్, మార్కెటింగ్, ఎగుమతులకు సంబంధించి అన్ని రకాలైన చర్యలు తీసుకోవడానికి కొన్ని సంస్థలను ఐడెంటిఫై చేస్తున్నట్లు అమిత్ షా ఆ సదస్సులో పేర్కొన్నారు.
– కేవలం సహకార సంఘాలతోనే కాకుండా, దాని పరిధిని విస్తరించి, గృహ నిర్మాణ, మత్స్య, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన శాఖలకు కూడా కోపరేటివ్ రంగాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతో పాటు కంప్యూటరైజేషన్ విధానంతో… రాష్ట్రాల్లో ఉన్న ఆప్కాబ్‌లు.. కో-ఆపరేటివ్ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను అనుసంధానం చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు.
– అలాగే దేశానికంతా మోడల్ బైలాస్ తీసుకు రావలని, కో-ఆపరేటివ్ సంస్థల్లో కూడా ఒక యూనిఫామిటీ తీసుకురావాలనే ఆలోచనతో అమిత్ షా ఈ సదస్సు నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి స్టేట్ లెవల్‌లో కో-ఆపరేటివ్ యూనివర్శిటీలను ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యను అందించి… వాటి ద్వారా హ్యూమన్ రిసోర్సెస్‌ను నియమించుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక మల్టీ ఎక్స్‌పోర్ట్ కో-ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సహకార రంగంలో ఎగుమతులకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
– రైతాంగానికి సహకార వ్యవస్థ అవసరం అవుతుంది. అలాగే సహకార వ్యవస్థ రైతాంగానికి అండగా నిలబడాల్సి ఉంటుంది. రాష్ట్ర సహకార వ్యవస్థకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్రం పునర్ విభజన తర్వాత వనరులు, ఆదాయాన్ని కోల్పోయాం. ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించాలని కోరాం. మా విజ్ఞప్తికి అమిత్ షా గారు సానుకూలంగా స్పందించారు. సహకార వ్యవస్థ, వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు సూచనలు, సలహాలతో పనిచేస్తూ, రైతాంగానికి సంపూర్ణంగా, సమగ్రంగా అండగా నిలబడతాం. అలాగే సహకార రంగంలో ఉన్నటువంటి పేదలకు మరింత ఆర్థిక స్వావలంబన చేకూరేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది.
– ఇప్పుడు ఉన్న 13 డీసీసీబీలను 26 చేయాలంటే ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాలి. ఆర్బీఐ అనుమతి వచ్చిన తర్వాత విభజన జరుగుతుంది.
ఆర్బీకేలకు దేశ,విదేశాల నుంచి ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గతంలో నష్టాల్లో ఉన్న డీసీసీబీ (జిల్లా కో-ఆపరేటివ్ సహకార బ్యాంక్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను జగన్ గారు అధికారంలోకి వచ్చాక లాభాల బాటలోకి తీసుకువెళుతున్నారు. నిధులు ఇచ్చి ఆదుకున్నాం. నాబార్డు కానీ ఆర్‌బీఐగానీ సహకరించాలంటే బ్యాంకులు ఆర్థికంగా పటిష్టంగా ఉండాలని, అందుకోసం చర్యలు తీసుకున్నాం. భారతదేశంలో ఎక్కడాలేనటువంటి విన్నూత్నమైన కాన్సెప్ట్ రైతు భరోసా కేంద్రాలు. విత్తనం అందించడం దగ్గర నుంచి, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు వరకూ అన్నిరకాల సేవలను అందిస్తున్న రైతు భరోసా కేంద్రాల గురించి కేంద్ర మంత్రి అమిత్ షా గారికి వివరించాం. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకులు దగ్గర నుంచి ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆర్‌బీకే వ్యవస్థను ప్రశంసిస్తున్నాయి.
ఏటా సగటున 14 లక్షల టన్నుల ధాన్యం అదనపు ఉత్పత్తి
జగన్‌గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరాసరి సంవత్సరానికి అదనంగా 14 లక్షల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ధాన్యానికి తగిన గిట్టుబాటు ధరలు ఇప్పిస్తున్నాం. అయితే ఎన్నికలు దగ్గర పడుతుంటే కొన్ని రాజకీయ పార్టీలు రైతుల్నే లక్ష్యంగా చేసుకుని వ్యవసాయానికి సంబంధించిన అనవసరపు విమర్శలు చేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో పేరుకుపోయిన బకాయిలను కూడా మా ప్రభుత్వం చెల్లిస్తోంది. చంద్రబాబు నాయుడు హయాంలో అన్నింటికి బకాయిలు పెట్టి వెళ్లాడు. చివరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారం డబ్బులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్యూరెన్స్.. ఇలా అన్నింటిలోనూ బకాయిలు పెట్టి దిగిపోతే, వాటన్నింటిని చెల్లించడంతోపాటు, రైతాంగానికి అండగా మా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. వాటి గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు భరోసా దగ్గర నుంచి పంటల బీమా వరకూ శాచురేషన్ పద్దతిలో రైతాంగానికి అందిస్తున్నాం.
– గత టీడీపీ హయాంలో కనీసం రెండు లక్షల టన్నుల ధాన్యం కొన్న పాపాన పోలేదు. ఎందుకంటే కరువు,చంద్రబాబు కవల పిల్లలులాంటివాళ్లు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే కరువు వచ్చేస్తుంది. కాబట్టి పంటలే పండవు. ఇక ప్రొక్యూర్‌మెంట్ ఏముంటుంది..?. రూ. 3వేల కోట్ల రూపాయిల ధరల స్థిరీకరణ నిధి ద్వారా.. రైతాంగానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో పంటలతో పాటు చిరు ధాన్యాలను కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు విషయంలో దళారులు పెత్తంన చేద్దామంటూ ఇక కుదరదు. డిజిటలైషన్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. రైతులకు సంబంధించి ఈ-క్రాప్ బుకింగ్ ద్వారా ఎంతైతే నమోదు చేసుకుంటారో వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది.
ఉచిత విద్యుత్ పై రాజీపడే ప్రసక్తే లేదు
రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అందులో మరో ప్రశ్న తలెత్తదు. మోటర్లకు మీటర్లు బిగించకపోతే ఎంత విద్యుత్ వాడుతున్నాం, ఎక్కడ ఖర్చు అవుతుందో, ఎవరు వాడుతున్నారో.. అనే దానిపై అకౌంటబులిటీ ఉండదు. దానివల్ల రైతులకు ఎంతమేరకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలం?. రైతులు ఎన్ని మెగా యూనిట్లు విద్యుత్ వాడుతున్నారనే దానిలో స్పష్టత ఉంటేనే.. నాణ్యమైన విద్యుత్ అందించగలం. దానికి అనుగుణంగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి వీలు అవుతుంది. మా ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి?.
వారిది మొసలి కన్నీరు
ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంట్ తీగలు మీద బట్టలు ఆరేసుకోవాలంటూ కరపత్రాలు వేయించిన చంద్రబాబు నాయుడు, టీడీపీ వారికి దాని గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని సూటిగా ప్రశ్నిస్తున్నాం. వాళ్లు ఇవాళ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు. రైతు శ్రేయస్సు కోరుకునే రైతు సంఘాలకు మేము స్పష్టత ఇచ్చాం. అర్థం చేసుకునే రైతు సంఘాలు అర్థం చేసుకున్నాయి. రాజకీయ ఉనికి కోసం పోరాడే రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే రైతు సంఘాలే వ్యతిరేకిస్తున్నాయి.
– ఒక్క రూపాయి కూడా రైతులపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే స్పష్టంగా చెప్పడం జరిగింది.