Suryaa.co.in

Andhra Pradesh

జిల్లా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి

-ఎటువంటి ప్రాణనష్టం లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి
-అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-అసని తుఫాన్ పై మంత్రి కాకాని సమీక్షా సమావేశం

నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో “అసని” తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మాత్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను ఈ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు నిరంతరం గ్రామీణ ప్రాంతాల పరిస్థితిపై సమీక్షించాలి అన్నారు.. విద్యుత్, ఫైర్, పోలీస్, పురపాలక శాఖ, మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. సహాయక కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి, ఏఎస్పీ వెంకటరత్నం విఆర్వో వెంకట రమణమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE