Suryaa.co.in

Andhra Pradesh

ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర

– ముస్లిం సోదరులందరికీ పవిత్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు
– మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం: రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.

సమైక్యతను, సమానత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు నూతన ప్రభుత్వంలో ధైర్యంగా, స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని… అల్లాహ్ పై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి, ఎదుటి వారికి సహాయం చేయాలని, సేవాభావం కలిగి ఉండాలని తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.

LEAVE A RESPONSE