– రెండు సంవత్సరాల 11 నెలల అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డును సాధించిన ఏకైక బాలుడిగా నిలిచిన కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్
– రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్
– 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించిన శ్రేయాన్ష్ కృష్ణ పటేల్
– తన మనవడి ప్రతభను చూసి మురిసిపోయిన మంత్రి సురేఖ
– శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ను ప్రశంసలతో ముంచెత్తిన వేదిక
– త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్ పొందనున్న శ్రేయాన్ష్ కృష్ణ పటేల్
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ, మురళీధర్ రావు మనవడు కొండా శ్రీయాన్ష్ మురళీకృష్ణ పటేల్ చెస్ క్రీడలో అరుదైన రికార్డును సాధించారు. క్రీడారంగంలో విశేష ఖ్యాతిగాంచిన రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) లో రెండు ప్రపంచ రికార్డులను సాధించి శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ చరిత్ర సృష్టించాడు. రెండు సంవత్సరాల 11 నెలల అత్యంత పిన్న వయస్సులోనే ఈ రికార్డును సాధించిన ఏకైక బాలుడిగా ఖ్యాతికెక్కాడు.
జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్ లో విశేష అతిథుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్కంఠ నడుమ శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ తన అద్భుత నైపుణ్యాలతో నిర్ణీత సమయంలో శ్రేయాన్ష్ కృష్ణ రికార్డును సాధించాడు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి , అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ను వెన్నుతట్టి ప్రోత్సాహించారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, చెస్ లో వరల్డ్ రికార్డ్ సాధించిన శ్రీయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ కు అభినందనలు తెలిపారు. శ్రీయాన్ష్ పటేల్ ‘నభూతో నా భవిష్యత్’ అన్నట్లుగా ఆడటం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. జూన్ లో బ్రిటన్ పార్లమెంట్ లో అవార్డు అందుకోనున్న శ్రీయాన్ష్ కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు అండగా ఉంటామని ప్రకటించారు.
మంత్రి సురేఖ మాట్లాడుతూ, శ్రేయాన్ష్ కృష్ణ ఎంతో ఓపికగా పజిల్స్ పరిష్కరించడంతో పాటు చెస్ బోర్డులను చాలా చక్కగా అమర్చడం అందరినీ ఉద్వేగానికి గురి చేసిందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ఆనంద భాష్పాలు రాల్చారు. శ్రీయాన్ష్ ఆధ్యాత్మిక చింతన, క్రీడా నైపుణ్యాలు తమను అబ్బురపరుస్తాయని శ్రీయాన్ష్ అమ్మ కొండా సుస్మిత పటేల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ దిశగా అతని ప్రతిభా సామర్థ్యాలను మరింతగా ప్రోత్సహించి, శ్రీయాన్ష్ లక్ష్యాల సాధనకు తమవంతు సహకారం అందిస్తామని సుస్మిత తెలిపారు.
రాయ్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు, కోచ్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీయాన్ష్ సాధన కేవలం రికార్డు కోసం కాదనీ, అతని మేధ భవిష్యత్ తరాలకు ప్రేరణ అని అన్నారు. సరైన మార్గదర్శకత్వం ఉంటే పిల్లలలో అపారమైన సామార్థ్యాన్ని వెలికి తీయవచ్చని ఈ సంఘటన నిరూపిస్తుందని తెలిపారు. రానున్న జూన్ లో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ బ్రిటీష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్ ను పొందనున్నట్లు తెలిపారు.
రెండు ప్రపంచ రికార్డులను సాధించిన కొండా
శ్రీయాన్ష్ పటేల్ కు రాయ్ చెస్ అకాడమీ తరఫున అతిథుల చప్పట్ల మధ్య ట్రోఫీలు, సర్టిఫికెట్ లను మంత్రి కొండా సురేఖ తో కలిసి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రదానం చేశారు.