Suryaa.co.in

Telangana

ఢిల్లీలో విగ్రహాల తయారీ స్టూడియోలను సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

ఢిల్లీ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో సుప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాలను తయారు చేసే స్టూడియోలను సందర్శించారు. హైదరాబాద్ నగరం
eswar నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా మహనీయులు, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకుని అక్కడ ఉన్న పలు విగ్రహాల తయారీ స్టూడియోలను సందర్శించారు. వివిధ విగ్రహాల తయారీకి వాడుతున్న వస్తువులు, పరికరాలు, పనిలో నిమగ్నమైన వారి అనుభవం, నైపుణ్యం, పూర్తయ్యేందుకు పట్టే సమయం, ఉపయోగిస్తున్న టెక్నాలజీ,అక్కడ నుంచి ఆ యా ప్రాంతాలకు తరలించడం ఎలా అనే విషయాల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు, క్షుణ్ణంగా పరిశీలించారు.

LEAVE A RESPONSE