మంగళగిరి : మంగళగిరి పట్టణం జీఆర్ స్కూల్ రోడ్డులో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య మనవడు ఆర్.రోహిత్ బాబు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా షోరూమ్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు.
షోరూమ్ మొత్తం కలియతిరిగి చేనేత వస్త్రాలను పరిశీలించారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కోసం చేనేత చీరలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.