Suryaa.co.in

Andhra Pradesh

వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

అమరావతిః ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE