పుంగనూరు ఏమైనా పాకిస్తాన్ లో ఉందా.? దేశ సరిహద్దుల్లో లేని ఆంక్షలు పుంగనూరులో ఎందుకు.?
స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాస్తున్నారు
రెండు రోజులైన సీఎం స్పందించకపోవడం సైకో మనస్థత్వానికి అద్దం పడుతోంది
ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వైసీపీకి ఉనికి లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– కిమిడి కళావెంకట్రావు
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుండి కుప్పంకు టీడీపీ కార్యకర్తలు చేపట్టిన సైకిల్ యాత్రపై వైసీపీ సైకోల ప్రవర్తన కలచివేసింది. ఉత్తరాంధ్రను అవమానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలి.
ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాస్తున్నారు. చొక్కాలిప్పించి ఒంటిపై నిల్చోబెట్టడానికి మనసెలా ఒప్పింది..ఇది మీ రాచరికమా లేక పెత్తందారీ పోకడలా పెద్దిరెడ్డి? ఘటన జరిగి రెండు రోజులైనా సీఎం స్పందించకపోవడం సైకో మనస్తత్వానికి నిరద్శనం. పుంగనూరులో అడుగుపెట్టి మళ్లీ వెళ్తారా అని హెచ్చరిస్తారా…పుంగనూరు ఏమైనా పాకిస్తానా.? దేశ సరిహద్దుల్లోనూ లేని ఆంక్షలు పుంగనూరులో ఉన్నాయి.
పుంగనూరులోనే ఇటువంటి చర్యలకు పాల్పడితే..ఇక విశాఖకు సీఎం వస్తే అక్కడి ప్రాంత వాసులకు స్వేచ్ఛ ఉండనిస్తారా.? ఉత్తరాంధ్ర సంపద, భూములపైనే వైసీపీ కన్న తప్ప..ఈ ప్రాంత ప్రజలపై ఏమాత్రం గౌరవం లేదు. ఘటనపై కనీసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రులు కూడా స్పందించకపోవడం చూస్తే వారి బానిసత్వం ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది.
వైసీపీలోని సీఎం సామాజిక వర్గానికి గులాంగిరి చేయడం మానుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వైసీపీకి ఉనికి లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించాలి.