Suryaa.co.in

Telangana

పునరావాస కేంద్రాలకు వెళ్ళండి: మంత్రి పువ్వాడ అజయ్

వరద ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెల్లవారుజామునుండే విస్తృతంగా పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసి తక్షణమే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు.

గోదావరి వరద ఉదృతి 68 అడుగులకు పెరిగిన దృశ్య ఇంకా పెరిగి 75 అడుగుల వరకు వస్తుందన్న సమాచారం మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలం పట్టణం AMC కాలనీ, సుభాష్ నగర్, శాంతి నగర్, మిథిలా స్టేడియంలో వరుద నీరు చేరడంతో ఆయా ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

మోకాళ్ల లోతులో నీళ్లలో మంత్రి పువ్వాడ స్వయంగా వెళ్ళి ప్రజలను తరలించారు. ముంపుకు గురైన వివిధ ప్రాంతాలలో ప్రజలను తక్షణమే తరలించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE