ఏపీ వైద్యశాఖ మంత్రి రజనీ తెలంగాణ బిడ్డనా?అవునంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామస్తులు. తమ గడ్డపై పుట్టిన బిడ్డ ఒక రాష్ట్రానికి మంత్రి కావడంపై ఇప్పుడు వారు బోలెడు సంబరపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విడదల రజని తెలంగాణ బిడ్డే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని మంత్రి కావటంపై ఆ గ్రామంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్తయ బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు.ఇతనికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు రజని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తతో వివాహమైంది. ఆమె పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.