విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్న ఆప్కో షోరూమ్ ను తనిఖీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవితి . గురువారం పెనుకొండ నియోజకవర్గానికి మంత్రి బయలుదేరారు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో దిగి ఆమె రోడ్డు మార్గాన పెనుకొండకు వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి సవిత…గురువారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడున్న ఉప్కో షోరూమ్ ను తనిఖీ చేశారు. అన్ని వస్త్రాలను పరిశీలించారు. ఏ ఏ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అమ్మకాలు రోజూ ఏ మేర జరుగుతున్నాయని ఆరా తీశారు. ఏ వ్యాపారిని కైనా కస్టమర్లే దేవుళ్లని, వాళ్లతో హుందాగా వ్యవహరించాలని అక్కడి సిబ్బందికి మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. ఆకస్మికంగా వచ్చిన మంత్రి సవితని చూసి విమానాశ్రయంలోని ఆప్కో షో రూమ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అనంతరం మంత్రిని షో రూమ్ లోకి సాదరంగా ఆహ్వానించారు.