రామచంద్రపురం : అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు అక్కల రిష్వంత్ రాయ్ ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్,చైర్మన్ గా నియమించినందుకు పట్టణ కాపు సంఘం మంత్రి సుభాష్ కి, ఆయన తండ్రి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు పట్టణ కాపు సంక్షేమ సంఘం శుక్రవారం స్థానిక శ్రీ అరిగెల వీర్రాఘవులు శ్రీమతి కృష్ణ వేణి కాపు కళ్యాణ మండపము నందు సమావేశమై అక్కల రిష్వంత్ ను అభినందించడంతో పాటు మంత్రి సుభాష్ కు, జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లకు ధన్యవాదాలు తెలిపారు. కాపు సామాజిక వర్గానికి ఇంతగా ప్రాధాన్యత నిచ్చి రిష్వంత్ రాయ్ కి ఉన్నతమైన మార్కెట్ కమిటీ పదవి ఇవ్వడం పట్ల కాపు సామాజిక వర్గం పై ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చని కాపు నాయకులు తెలిపారు.
ఈ సమావేశంలో కాపు సంఘం అధ్యక్షులు తొగరు బ్రహ్మాజీ, ఉపాధ్యాక్షులు మట్టా దుర్గారావు, కాపు పెద్దలు నారప రెడ్డి బలరామ్, పోలిశెట్టి శ్రీనివాసరావు,నాయుడు మాస్టారు తదితరులు మాట్లాడారు. కాపులకు ఉన్నత స్థానమిచ్చిన మంత్రి సుభాష్ కి బుణపడిఉంటామని, ఎన్నటికీ ఆయిన వెంటే ఉంటామని వారంతా ముక్త కంఠంతో తెలిపారు.