తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8వ తేదీ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” లో పాల్గొనాల్సిందిగా కోరుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ని మర్యాద పూర్వకంగా వారి కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడి అవకాశాలు, వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన పురోగతిని వివరించారు. దేశ–విదేశాల నుండి అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు, నిపుణులు పాల్గొనబోతున్న ఈ గ్లోబల్ సమ్మిట్లో మధ్యప్రదేశ్ పాల్గొనడం రెండు రాష్ట్రాల మధ్య సహకార అవకాశాలను మరింత విస్తరిస్తుందని తెలిపారు. తెలంగాణ–మధ్యప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి ప్రయాణంలో పరస్పర సహకారం కీలకమని, ఈ సమ్మిట్ ఆ దిశగా మంచి వేదిక కానుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.