హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న.. తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవ్వాలని.. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజ్హి ని ప్రత్యేకంగా ఆహ్వానించారు రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. భువనేశ్వర్ లో ఈ రోజు సచివాలయం లో సీఎం మోహన్ చరణ్ మాజ్హి ని మంత్రి శ్రీహరి కలిశారు. మంత్రి శ్రీహరి ని సాదరంగ ఆహ్వానించి షాలువాతో సత్కరించారు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజ్హి..ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఒడిశా ముఖ్యమంత్రి కి అందజేశారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్యే లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, భవిష్యత్తు లో అనుసరించే ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు మంత్రి వివరించారు. నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు.. వివిధ రంగాల నిపుణుల ఆలోచనల మేరకు తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజ్హి కి వివరించారు. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజ్హి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కి ,స్వయంగా ఒడిశా కి వచ్చి తనకు ఆహ్వానపత్రాన్ని అందచేసిన మంత్రి శ్రీహరి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా ఒడిశా ముఖ్యమంత్రి కి మంత్రి వాకిటి శ్రీహరి జ్ఞాపిక అందజేశారు .