Suryaa.co.in

Andhra Pradesh

పడవలో వెళ్లి బాధితులకు సాయం చేసిన మంత్రి వేణు

– కోనసీమ జిల్లా లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర బిసి సంక్షేమ, ఐ అండ్ పిఆర్, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ

రామచంద్రపురం నియోజక వర్గం కోటిపల్లి గ్రామంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను మంత్రి నేరుగా ఇంటింటికి పంపిణీ చేశారు. బాధితులతో కలసి మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుంటూ, జరుగుతున్న ఏర్పాట్లును ఆడిగి తెలుసుకొన్నారు.

కోనసీమ జిల్లా అధికారులతో మంత్రి ఫోన్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులుboat1 సిద్ధంగా ఉండాలనీ, అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని,
లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే శిబిరాలకు తరలించాలని మంత్రి అధికారులకి ఆదేశించారు.

సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలనీ, మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనీ తెలిపారు. ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలనీ అధికారులకు సూచించారు. కరెంటు సరఫరాకు అంతరాయం రాకుండా చూడాలని, తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసు చేయాలనీ తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు రూ.2కోట్లు తక్షణ నిధులను మంజూరు చేశారనీ మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE