– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్లలో వైసీపీ నేత అచ్చి ప్రభాకర్ అభినవ దుశ్శాసనపర్వంతో మహిళా లోకమంతా అవాక్కయ్యింది. వడ్డిపాలేనికి చెందిన లక్ష్మి అప్పుతీర్చలేదని ఆమె తల్లి అనసూయతోపాటు వచ్చిన మహిళలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడటం దారుణం. వైసీపీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. వైసీపీ నేతలు దుశ్శాసనుల్లా ఘోరంగా మహిళల్ని అవమానిస్తుంటే, రక్షణగా నిలవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం మన రాష్ట్రంలో అరాచక పరిస్థితులకి అద్దం పడుతోంది. సొంత తల్లి, చెల్లి ప్రాణాలకే ప్రమాదం తలపెట్టిన ముఖ్యమంత్రి పాలనలో సామాన్య మహిళలకి భద్రత దొరుకుతుంది అనుకోవడం భ్రమే.