– వాలంటీర్లకు ఏడాదికి రూ. 2 వేలు కోట్ల ప్రజాధనం
– ప్రభుత్వ ధనం జీతాలుగా ఇచ్చి పార్టీ సేవ
– వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
• వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్ధను దుర్వినియోగం చేస్తోంది
• ప్రభుత్వ ధనం జీతాలుగా ఇచ్చి పార్టీ సేవ చేయించుకోవటం దేశంలో ఇధే ప్రధమం
• వాలంటీర్లకు ఏడాదికి రూ. 2 వేలు కోట్ల ప్రజాధనం దోచి పెడుతున్నారు
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీ అభ్యర్దుల తరపున ప్రచారం నిర్వహించారు
• మంత్రుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ప్రభుత్వ వ్యవస్ధ దుర్వినియోగంపై నోరుమెదపకుండా నిస్తేజంగా ఉన్నారు
• కనీసం ఒక్క జిల్లా కలెక్టర్ కూడా వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై మాట్లాడకపోవటం ఆశ్చర్యం కల్గిస్తోంది.
• టెక్కలికి చెందిన వైసీపీ నేత పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దులను గెలిపించకపోతే ఉద్యోగాలు తీసేస్తామని వాలంటీర్లను బెదిరించారు
• వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇలానే వాలంటీర్లను, అధికారులను బెదిరిస్తున్నారు.
• వైసీపీ కుటుంబ సభ్యులే వాలంటీర్లుగా నియమింపబడ్డారని మంత్రులతో సహా బహిరంగంగా చెప్పారు.
• వాలంటీర్ వ్యవస్ధను దుర్వినియోగం చేయొద్దని గతంలో ఎన్నికల కమిషన్ ఆదేశించినా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేలాది దొంగ ఓట్లను నమోదు చేయించేందుకే వాలంటీర్లను ఉపయోగించారు.
• ఇప్పుడు వైసీపీ పోస్టర్లు, కరపత్రాలు అంటించడానికి ఇంటింటికి పంచడానికి గృహసారధులతో కలిసి పని చేయాలని ఆదేశించారు.
• ఇది ప్రజాస్వామ్య బద్ద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం
• వాలంటీర్లు తమ జాబ్ చార్ట్ ప్రకారం వారు విధులు నిర్వహిస్తే వారిపై వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు.
• ఈ నేపధ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన సక్రమంగా నడిచేందుకు వాలంటీర్లను కట్టడి చేయాలి.
• నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించి వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగం కాకుండా చూడాలి.
• వాలంటీర్ వ్యవస్ధను దుర్వినియోగం చేస్తూ వైసీపీ కార్యకలాపాలకు అనుమతిస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలి.
• వాలంటీర్లు వారి జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.