మిథున్ రెడ్డికి ఈడీ పిలుపు!
– అమ్ముడుపోయిన ప్యాలెస్ కోటరీతో నీకు మదురో గతి అని జగనుకు జర్క్ ఇచ్చిన విజయసాయి రెడ్డి!
వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఈడీ నుంచి “ప్రేమలేఖ” (సమన్లు) అందింది. రాజమహేంద్రవరం జైలులో 71 రోజుల రిమాండ్ తర్వాత, ఇప్పుడిప్పుడే బయట గాలి పీలుస్తుంటే.. మళ్ళీ ఈడీ పిలుపు రావడం అంటే మామూలు విషయం కాదు.
జతగాళ్ల జోరు: 22న ఏ-2 (విజయసాయిరెడ్డి), 23న మిథున్ రెడ్డి! అంటే గురువారం జగన్ గురువుగారు వెళ్తే, శుక్రవారం జగన్ శిష్యుడు పెద్దిరెడ్డి వెళ్తున్నారన్నమాట. ఒకరు వాంగ్మూలం ఇస్తే, ఇంకొకరు దానికి సమాధానాలు ఇవ్వడానికి వెళుతున్నారు. తెలీదు, గుర్తులేదు అంటే ఊకొట్టడానికి మన లోకల్ దర్యాప్తు సంస్థ కాదు. అక్కడ ఈడీ ముందు ఈ లిక్కర్ కేడీల పప్పులు ఉడకవు. పుంగనూరు నుండి ఆఫ్రికా వరకు తనిఖీల తుట్టె కదులుతుంది.
నాడు ఏపీలో ‘ప్రెసిడెంట్ మెడల్’, ‘బూమ్ బూమ్’ లాంటి చిత్ర విచిత్రమైన బ్రాండ్లను ప్రమోట్ చేసి జనం జేబులు ఖాళీ చేశారు. ఇప్పుడు ఆ పుణ్యమా అని ఈడీ వారు ఈయనకు ‘స్పెషల్ బ్రాండ్’ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు.
16 సంస్థలకు రూ. 23 వేల కోట్ల ఆర్డర్లు ఇప్పించిన ఘనత ఈయనది. ఆ 3,500 కోట్ల కమీషన్ల లెక్క తేల్చడానికి ఈడీ పిలిస్తే.. బహుశా “నేను కేవలం ఆర్డర్ ఇచ్చాను, కిక్కు మాత్రం ప్యాలెస్‌కు వెళ్ళింది” అని చెబుతారేమో! ఈయన చెప్పకపోతే విజయసాయి రెడ్డి ఆ లెక్కలు పక్కాగా చెబుతాడేమో!
అటు సాయిరెడ్డి గారేమో “కోటరీ అమ్ముడుపోతే ప్యాలెస్‌లో ఉన్నవాడికి కూడా మదురో గతే పడుతుంది” అని ట్వీట్లేస్తున్నారు. అది చూసి మిథున్ రెడ్డి నుండి జగన్ రెడ్డి వరకు కిక్కు దిగిపోయి ఉంటుంది.. “పెద్దాయన ముందే అల్లాడిపోతున్నారు, మన పరిస్థితి ఏంటి?” అని.
71 రోజులు రాజమండ్రి జైలులో ఉండి వచ్చిన అనుభవం ఉంది కాబట్టి, ఈసారి ఈడీ గెస్ట్ హౌస్ ఎలా ఉంటుందో చూపాలని ఈడీ డిసైడ్ అయినట్టుంది.లిక్కర్ స్కామ్ అంటే ఏదో చిన్న విషయం అనుకున్నారు.. కానీ అది ఇప్పుడు తాడులా చుట్టుకుంటోంది.
నాడు తాగినోడికి లివరు ఖరాబు.. ఇప్పుడు అవి అంటగట్టి ప్రాణాలు తీసిన ప్రతి పాపాత్ముడినీ అనకొండలా చుట్టేస్తోంది! జనవరి 23న విచారణలో మిథున్ రెడ్డి గారు ఎంతవరకు “రహస్యాలు” దాయగలుగుతారో.. ఈడీ దగ్గర రెడీగా ఏ గుట్టు ఉందో అని తాడేపల్లి ప్యాలెస్‌లో గుటకలు మింగుతున్నారు!
ఆ భయంతో లిక్కర్ షాపుల మీద పడింది యావత్తు వైకాపా. ముసలోల్లకి క్వార్టర్ ఆశ చూపి ఐదు క్వార్టర్లను కొనిపించి బెల్ట్ అంటారు. ఏకంగా తిరుమల కొండమీద సాక్షి. వైకాపా కార్యకర్తలను పంపి బాటిల్స్ పెట్టి బెల్ట్ అని గగ్గోలు పెడతారు.
కోడి పందేల దగ్గర మద్యం వాసన చూసిన శునకాల లెక్కన మొరుగుతున్నారు. పందెం వేసుకుని 19 బీర్లు తాగి పోతే నకిలీ మద్యం అంటారు. పన్నుతున్న ప్రతి కుట్రలో అడ్డంగా దొరికిపోతున్నా కూడా కుట్రలు ఆపడం లేదు బరితెగించిన వైకాపా. లిక్కర్ స్కాం క్లైమాక్స్ దిశగా వెళుతోంది.