-ఎంపీ బర్త్ డే సందర్భంగా ఫొటో పంచుకున్న ఎమ్మెల్యే
వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో భాగంగా శ్రీబాలాజీ జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి… ఓ ఆసక్తికరమైన ఫొటోను ట్వీట్ చేస్తూ సాయిరెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పారు.
ఈ ఫొటోలో సాయిరెడ్డి బుల్లెట్ బండిని నడుపుతుండగా… ఆయన వెనుక బుల్లెట్‌పై చెవిరెడ్డి కూర్చుని ఉన్నారు. విజయవాడ నుంచి తాడేపల్లి దాకా ఇటీవల పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో భాగంగా ఈ ఫొటో తీసినట్లుగా తెలుస్తోంది. ‘మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ప్రజలకు మరింతగా సేవ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ సాయిరెడ్డికి చెవిరెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన చెవిరెడ్డికి సాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ అభిమానపూర్వక శుభాకాంక్షలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలే నాకు ప్రేరణ. https://t.co/unJ5T3nMFa
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 1, 2022