Suryaa.co.in

Andhra Pradesh

కొండబాబుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్…

మాజీ టిడిపి ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్…

గత పదేళ్ళుగా జయలక్ష్మీ కోపరేటివ్ సోసైటీ బ్యాంక్ ఛైర్మన్, డైరక్టర్లతో నాకు పరిచయం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుండి వైదొలుగుతా. నాకు,జయలక్ష్మి బ్యాంక్ కు ఎలాంటి సంబంధం లేదు. యాక్సిక్ బ్యాంక్ లో మార్ట్ గేజ్ లో ఉన్న జయలక్ష్మీ బ్యాంక్ కు చెందిన 73 గజాల స్ధలాన్ని వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా చూసే కుమార్ కొనుగోలు చేయడం వాస్తవం.కాని దానిని నేను సమర్ధించను.

నాలుక ఉంది కదా అని అవాస్తవాలు మాట్లాడితే నాలుక చీరేస్తా. జయలక్ష్మి బ్యాంక్ భాధితులకు న్యాయం జరిగేలా చిత్తశుద్దితో పని చేస్తాను. బాధితులు కలిసిన వెంటనే విషయాన్ని సిఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి సిట్ ఏర్పాటు అయ్యేలా చేశాను. ఐదు జిల్లాల పరిధిలో ఉన్న జయలక్ష్మి బ్యాంక్ కేసు దర్యాప్తు జరుగుతుంది. అక్టోబర్ లో బ్యాంక్ కు ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం వస్తే కేసులో నిందితులను అరెస్ట్ చేస్తారు. కోపరేటివ్ బ్యాంకులు నాశనం అయింది టిడిపి పాలనలోనే.

LEAVE A RESPONSE